ప్రమాదానికి గురైన జర్నలిస్టు ను పరామర్శించిన టి.డబ్ల్యూ.జె.ఎఫ్
ఇటీవల సత్తుపల్లి పట్టణంలోని రాణీ సెలబ్రేషన్ పంక్షన్ హాలు వద్ద జరిగిన అధికార పార్టీ కార్యక్రమంకు సంబంధించిన వార్త కవరేజ్ చేయడానికి వెళ్ళి రిటర్న్ అయి బయటకు వచ్చి బైక్ పై వస్తుండగా సత్తుపల్లి నుండి అతి వేగంగా వస్తున్న రేజర్ల గ్రామానికి చెందిన మల్లెల శ్రీనివాసరావు కారు డీ కొనడంతో సత్తుపల్లి ప్రజా గొంతుక దినపత్రిక రిపోర్టర్ నల్లoటి రాంబాబు వెన్నుపూసకు కనిపించని బలమైన దెబ్బ తగిలి అక్కడిక్కడే కుప్ప కూలిపోగా అక్కడ ఉన్న కొందరు లేపి సత్తుపల్లి పట్టణంలోని రఘురామ్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి కి తీసుకెళ్ళిన విషయం పాఠకులకు విదితమే.అనంతరం ఖమ్మం నగరంలోని వేద ఆసుపత్రిలో వైద్యం తీసుకొని తిరిగి రాంబాబు మండల పరిధిలోని సిద్దారం గ్రామంలో గల తన స్వగృహానికి వచ్చిన విషయం తెలుసుకున్న టిడబ్ల్యూజెఎఫ్ సత్తుపల్లి నేతలు మల్లూరు చంద్రశేఖర్ (తెలుగుగళం,నేటి ప్రజావాణి దినపత్రికల ఆర్ సి),ఆరెంపుల హరిబాబు(జాతీయవాణి దినపత్రిక)లు శుక్రవారం కలసి పరామర్శించారు.
ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేత,పెద్దలు రేజర్ల గ్రామ వాసి సుబ్బారెడ్డి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని న్యాయం కోసం వేచి చూస్తునన్న్నారు.సుమారుగా ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.