ప్రలోబాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలి
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తొర్రూరు ఆర్డీవో గణేష్ అన్నారు. ఆదివారం మరిపెడ తహసిల్దార్ కార్యాలయంలో
జాతీయ 16వ ఓటర్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఓటు హక్కును దాని యొక్క ప్రాధాన్యత పై ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాముఖ్యత కలిగిన చిత్రాలను ప్రదర్శించిన వారికి బహుమతులను వారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం ప్రజాస్వామ్య దేశమని, సాంప్రదాయాలను స్వేచ్ఛాయితను కాపాడుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించిన దేశంగా ఉందన్నారు. ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ తహసిల్దార్ కొండపల్లి కృష్ణవేణి, మండల గిర్దవారి ఎస్ శరత్ చంద్ర, సీనియర్ అసిస్టెంట్ రజిని, కార్యదర్శి సిబ్బంది, బి ఎల్ వో లు, తదితరులు పాల్గొన్నారు.
-సీనియర్ సిటిజన్స్ కు ఘన సన్మానం..
గత 60 ఏళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటున్న స్వాతంత్ర సమరయోధురాలు అనంతగిరి వెంకటమ్మ, గుమ్మడి నారాయణలను తొర్రూరు ఆర్డీవో గణేష్, తాసిల్దార్ కృష్ణవేణి ఘనంగా సన్మానించారు.
వారికి మెమోటోను అందించి సత్కరించారు.