
ఈ69న్యూస్ వరంగల్:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన ప్రవీణ్ పగడాల మృతి అనుమానాస్పదంగా ఉందని,తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని కెవిపిఎస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరూరి కుమార్ డిమాండ్ చేశారు.శనివారం రోజున రంగశాయి పేట జంక్షన్ లో కెవిపిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు ఉసిల్ల కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అరూరి కుమార్ హాజరై మాట్లాడుతూ..ప్రముఖ మేధావి ఇంటలెక్చువల్ పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం అనేక అనుమానాలకు దారి తీస్తుందని,తమ కుటుంబ సభ్యులు క్రైస్తవ పాస్టర్లు పేర్కొంటున్న విధంగా ఇది ఆత్మహత్య కాదు హత్యేనని చెప్పిన దానిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు.మతం వ్యక్తిగత విశ్వాసం లాగా ఆయన భావించి క్రిస్టియన్ మతాన్ని స్వీకరించాడని,వివిధ టీవీ డిబేట్లో తన మతంలోని మంచి అంశాలను చెబుతూనే సమాజంలో జరుగుతున్న అనేక రకాల అవమానాలను ఎండగట్టారని దళితులపై దాడులు జరిగినప్పుడు పలుమార్లు చర్చించేవాడని అన్నారు.మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉన్మాదులు ఏ మతంలో ఉన్నా దేశానికి ప్రమాదమేనని అన్నారు.తన ప్రసంగాల కింద అనేక రూపాలలో ఆయనను చంపుతామని బెదిరింపులకు కూడా మతోన్ముకలు వేధించారని అలాంటి వారిని పాస్టర్ ప్రవీణ్ మరణం దేహానికొండ బడిన గాయాలు కానీ ఆ ప్రదేశంలో చూసిన ప్రతి అంశం అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఎలాంటి విషయమైనా సిట్టింగ్ జడ్జి సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేశారు.ఒక మనిషిని మరొక మనిషి చంపుకోవడం అవమానించడం కించపరచడం అనేది ఏ మతం చెబుతుందో వివరించాలని అన్నారు.ప్రవీణ్ పగడాల వృత్తిపట్ల కెవిపిఎస్ ప్రగాఢ సంతాపం ప్రకటిస్తుందని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి కొంగర వరుణ్ కుమార్,సింగారపు సుమన్,దరిపెల్లి కుమార్,సుదర్శన్,తదితరులు పాల్గొన్నారు.