
ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ప్రీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఈ రోజు ఉదయం 32,33,34,39 డివిజన్ల హెల్త్ ఆఫీసర్,సూపర్వైసర్,జవాన్లు మరియు నాలుగు డివిజన్లకు సంబంధించిన కార్మికులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
గతంలో తాను మేయర్ గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికుల కోసం ఎంతగానో కృషి చేశానని మునుముందు కూడా అన్ని విధాలా సహకరిస్తానని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్,మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని దేశంలో ఎక్కడా లేని విదంగా క్రిస్మస్ కు బట్టల పంపిణీ చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,కార్మిక విభాగ అధ్యక్షులు,ముఖ్యనాయకులు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు