
డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్*
హనుమకొండ: ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజుల వసుళ్లపై నియంత్రణ ఏదని ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్నారు.
హనుమకొండ, రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. చాలా సంవత్సరాల నుంచి ఫీజుల నియంత్రణ కోసం విద్యార్థి యువజన, సంఘాలు తల్లిదండ్రులు పోరాటాలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం పట్టించుకోవడం లేదని, ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలకు వత్తాసు పలుకుతున్నారని, అందుకే వాళ్ళు రెచ్చిపోతున్నారని, ఫీజుల నియంత్రణ కోసం అనేక చట్టాలు చేసిన కాగితాలకే పరిమితం అయితున్నాయి తప్ప, అమలకు నోచుకోవడం లేదని, విమర్శించారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజుల వసూల పై ప్రభుత్వము, అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఇప్పటికే అడ్మిషన్, ఎంట్రన్స్, రిజిస్ట్రేషన్, ట్యూషన్, పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్ స్టేషనరీ పేర్లతో తల్లిదండ్రులు దోచుకుంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ప్రైవేట్ కార్పొరేటు యజమాన్యాలను, ప్రభుత్వాన్ని తల్లిదండ్రుల నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, కార్యదర్శి దొగ్గెల తిరుపతి, ఉపాధ్యక్షులు మంద సుచందర్, జిల్లా సహాయ కార్యదర్శులు ఓర్సు చిరంజీవి, చిట్యాల విజయ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ చిలుక జంపన్న, దేవేందర్ పాల్గొన్నారు.