
.లింఘాలగణపురం మండలం , బండ్లగూడెం గ్రామంలోని బండగుట్ట శ్రీ లక్ష్మినరసింహా స్వామి వారి విగ్రహ ప్రతిస్థాపన కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు బండగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ఆ లక్ష్మి నరసింహ స్వామి వారి కరుణాకటాక్షాలతో బండ్లగూడెం ప్రజలు అదేవిధంగా లింగాలగణపురం మండల ప్రజలు వెరసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని సుఖ సంతోషాలతో , శాంతి సమాధానంతో ఉండాలని పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామి వారికి మొక్కుకున్నానని తెలిపారు.
బండ్లగూడెం గ్రామంలో గల బండగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయమునకు స్వయంభూ దేవాలయం అనే ప్రసిద్ధి కలదు అని అన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ అభివృద్ధిలో భాగంగా రోడ్డు సదుపాయం కల్పనకు నా సిడిఎఫ్ నిధుల నుండి గతంలో 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగినది మళ్లీ కూడా దేవాలయ అభివృద్ధి విషయంలో ఆలయ కమిటీ మరియు స్థానిక సర్పంచి గారు కలిసివస్తే సంబంధిత పనులకు నిధులు మంజూరు చేస్తానని అన్నారు.
ఇప్పటికే ఈ దేవాలయంలో ధూపదీప నైవేద్యం కోసం దేవాదాయ శాఖకు లెటర్ పంపియున్నాము అది త్వరగా అయ్యేటట్టుగా సంబంధిత దేవాదాయ శాఖమంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారిని కలిసి త్వరగా అయ్యేటట్టు చూస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించి మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ఎమ్మెల్యే గారు శాలువాలతో సన్మానించి సత్కరించి అభినందించారు