
బండి సంజయ్ కవితపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు వేమూరి సత్యనారాయణ శనివారం మునగాల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితపై. చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని. అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షులు మరియు పార్లమెంటు మెంబర్ గా ఉండి. ఒక మహిళా ప్రజాప్రతినిదిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరం అవమానకరమని. ఆర్ఎస్ఎస్ బావా జాలం విలువలు విశ్వసనీయత లు సమాజ హితం సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నామన్న ఈ బీజేపీ నాయకులు సభ్య సమాజం తలదించుకునే లాగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని. ఇట్టి విషయంపై హైదరాబాదు నగర మేయర్ విజయలక్ష్మి మన రాష్ట్ర గవర్నర్ తమిళ సై కలసి వినతి పత్రం ఇవ్వాలని అపాయింట్మెంట్ కోరిన ఒక మహిళా ప్రజాప్రతినిధి కి అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని ఎక్కడ చీమ చిటుక్కుమన్నా. స్పందించే గవర్నర్ ఇట్టి విషయంపై స్పందించాలని అన్నారు ఇకనైనా బిజెపి నాయకులు సిద్ధాంతాలకు లోబడి ప్రవర్తించాలని అన్నారు