
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ
తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామం క్రింది బజారులో గత వారం రోజులుగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. గురువారం బతుకమ్మ సాంస్కృతిక కమిటీ ఆహ్వానం మేరకు దొడ్డ శ్రీనివాసరావు ఆ వేడుకల్లో పాల్గొని వారితో ఆడి,పాడి కమిటీ వారిని ఉత్తేజపరిచారు వారితో కలిసి కొద్దిసేపు కోలాటం నృత్యం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ నేడు విశ్వ వ్యాప్తమయ్యిందని,నేడు ఖండాంతరాలలో బతుకమ్మ కీర్తి కొనియాడ బడుతున్నదని,బతుకమ్మను ఖండాంతరాలకు పరిచయం చేసిన ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కిందని కేసీఆర్ సర్వ మతాలను సమదృష్టితో ప్రోత్సహించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక నాయకులు,బతుకమ్మ సాంస్కృతిక కమిటీ సభ్యులు,మహిళలు, యువతీ,యువకులు తదితరులు పాల్గొన్నారు