

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని గడిపల్లి,రావులపల్లి మరియు రేగొండ మండల కేంద్రంలో ఘనంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడు నూతుల నిశిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి,పూలతో అలంకరించిన బతుకమ్మను నదిలో నిమజ్జనం చేసి ఆనందాన్ని పంచుకున్నారు.నిశిధర్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా, మహిళల ఐక్యతకు చిహ్నంగా, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించే ఉత్సవమని పేర్కొన్నారు. పల్లెలో జరుగుతున్న సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.అలాగే, గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకొని, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళలు,యువతులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.