
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు
గళం న్యూస్ మునగాల
మునగాల:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపీ కాలో బిఆర్ఎస్ పార్టీ ఏకపక్ష నిర్ణయాలను మానుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శనివారం సిపిఎం మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో షేక్ సైదా అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ, మైనార్టీ లకు లక్ష రూపాయల సహాయం, గృహలక్ష్మి పథకం, లబ్ధిదారుల ఎంపికలు గ్రామ సభలకు సంబంధం లేకుండా అధికార జోక్యంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని తమ పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరినారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేవారం వెంకటరెడ్డి,G వెంకట్ రెడ్డి మండల కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, జె విజయలక్ష్మి వి వెంకన్న,టి సతీష్, ఎం గోపయ్య, బి ఉపేందర్, గురవయ్య నాగయ్య A రామకృష్ణారెడ్డి, బి కృష్ణారెడ్డి ఆర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు