
బిఆర్ఎస్ తోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధి
బిఆర్ఎస్ తోనే ముస్లిం మైనార్టీలకు అభివృద్ధి సాధ్యమని మరిపెడ పట్టణ బిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ లతీఫ్ అన్నారు. శనివారం ఉగ్గంపల్లి లో డి ఎస్ రెడ్యా నాయక్ నివాసంలో బీచ్ రాజ్ పల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు నివాసంలో సయ్యద్ లతీఫ్ మరిపెడ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు మక్సుద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లింలు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మరిపెడ కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రి అప్ గ్రేడ్ కావడంతో ఎమ్మెల్యే కృషితో సాధ్యమైందని అన్నారు. అనంతరం మరిపెడ నుండి హజ్ యాత్రకు వెళ్లి వచ్చిన అబ్దుల్ సత్తార్ అబ్దుల్ జబ్బర్ మెహమూద్ లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కి మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న మాజీ కోఆప్షన్ సభ్యులు ఆయుబ్ పాషాకి హజ్ నుండి తెచ్చిన ఖర్జూర జంజం వాటర్ వారికి అందజేశారు. హజకు వెళ్లి వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజీ జహంగీర్ సాబ్ మజీద్ సదర్ రజబ్ అలీ సాబ్ మరిపెడ మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్ బిఆర్ఎస్ మండల మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షాబుద్దీన్ అబ్దుల్ సత్తార్ సయ్యద్ అవేజ్ సాజిద్ఇమామ్ హుస్సేన్ గౌస్ తదితరులు పాల్గొన్నారు