
బిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించ బోతుందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తేల్చి చెప్పారు. బుధవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనంతగిరి మండలం పాలారం గ్రామానికి చెందిన , నడిగూడెం మండలం చెన్నకేశవపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి,సంక్షేమాలను చూసి యావత్ ప్రజానీకం బిఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అతి తక్కువ కాలంలో అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించిన బిఆర్ఎస్ ప్రభుత్వం తిరుగులేని శక్తిగా ఆవిర్భావించిందన్నారు. మరో 20 ఏండ్లు తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉండేది బిఆర్ఎస్ పార్టీయే నని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని, దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్య మంత్రి కేసీఆర్ అని అన్నారు.దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కులేని పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరానికి ముందు ఆకలి చావులు ఉండేవి. నేడు కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజల మూడు పూటలు కడుపు నింపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు.నేటికీ బిజెపి పాలిత ప్రాంతాలలో ప్రజల ఆకలి చావులు కొనసాగుతున్నాయి.రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నామన్నారు.యావత్ భారత దేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు.నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాలన్వే పకడ్బందీగా అమలవుతున్నాయంటూ కితాబిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో మాదాసు మంగమ్మా, ఎల్లయ్య, శ్రీనివాస చారి, సురేష్, తుంగ నాగరాజు, ఊట్కూరు మహేందర్, గురూజీ, ప్రసాద్, నరేష్, చింతా మహేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంపటి వెంకటేశ్వరరావు, పాలడుగు ప్రసాద్, మట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సైదులు గౌడ్, కొండలు, కాసాని వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.