
ఈ69న్యూస్ హన్మకొండ
అయినవోలు మండలం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో బిజెపి అయినవోలు మండల పార్టీ అధ్యక్షుడు మాదాసు ప్రణయ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు.జెండా ఆవిష్కరణను బిజెపి జిల్లా కార్యదర్శి,సీనియర్ నాయకుడు గుండె కారి కోటేశ్వర్ రావు నిర్వహించారు.ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బొల్లంపల్లి మహేశ్వర్ గౌడ్,సూదుల రవీందర్ రెడ్డి,కోట నరసయ్య,ఆడెపు భాస్కర్,కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు పాక కుమార్ స్వామి,ఒంటిమామిడిపల్లి మాజీ ఉపసర్పంచ్ రాజు,తాళ్లపల్లి వెంకటనారాయణ,నరిగె రాజేష్,గుండబోయిన నరసింహ గౌడ్,173వ పోలింగ్ బూత్ అధ్యక్షులు పులి సాగర్ గౌడ్,అమరావతి నాగరాజ్,బాల్య రవీందర్,కాయిత్ రాజ్ కుమార్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.వీరి సమూహం బిజెపి సిద్ధాంతాల పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.అనంతరం పార్టీ అభివృద్ధి,బలపరచే దిశగా కార్యాచరణపై చర్చలు జరిపారు.