కోదాడ రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని *కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్* అన్నారు. శుక్రవారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల పిలుపు మేరకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల కు నిరసనగా కోదాడ పట్టణంలో రంగా థియేటర్ సెంటర్ లో మహా ధర్నా,గ్యాస్ సిలిండర్ లతో నల్ల జెండా లతో భారీ నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మహాధర్నకు నల్ల దుస్తులతో గ్యాస్ సిలిండర్ మోసుకుంటూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అర్థమయ్యే విధంగా మహా ధర్నాకు చేరుకున్నారు.అనంతరం నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ఆయన అన్నారు.అసత్య ప్రచారాలతో బిజెపి ప్రభుత్వం పబ్బం గడుపుతుందని అన్నారు.ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రాలపై బిజెపి ప్రభుత్వం వివక్ష చూపుతుందని తెలిపారు.బిజెపి రహిత రాష్ట్రాలు అభివృద్ధిలో ముందున్నాయి అని అన్నారు.మోడీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకకు వెళ్తోందని అన్నారు.పేదోళ్ళ కడుపుకొడుతున్న బిజెపికి పార్టీకి భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి తాకాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.అదానీ అంబానీలే మోడీ పాలనలో బాగుపడ్డారు.నిరుపేదల నడ్డి విరిచే సంస్కరణలు బిజెపి తీసుకొస్తోందని ఆయన తెలిపారు.బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.. ధరలు దిగొచ్చే వరకు పోరాటం చేద్దామన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గృహ అవసరాల సిలిండర్ ధరను 50 రూపాయలు,కమర్షియల్ సిలిండర్ ధరను 350 రూపాయల మేర భారీగా పెంచిందని మండి పడ్డారు.అటు ఆయా రాష్ట్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ఈరోజు ఇంత భారీగా సిలిండర్ ధరను పెంచడం దారుణం అన్నారు. మోడీ ప్రభుత్వం రాకముందు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర 1160ని దాటి 1200లకు చేరుకుందన్నారు.ఈరోజుమహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన కానుకగా ఈ సిలిండర్ ధరల పెంపు అంటూ ఆయన ప్రశ్నించారు.పెరుగుతున్న సిలిండర్ ధరలపైన ప్రజలకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని పెరుగుతున్న సిలిండర్ ధరలు, సరుకుల పెరుగుదల పైన ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉన్నదన్నారు. ఈ ధరల పెరుగుదల వలన ప్రజలు అనేక ఎదుర్కొంటున్నారు.ఒకవైపు ఉజ్వల స్కీం పేరుతో మాయమాటలు చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు భారీగాసిలిండర్ ధరలను పెంచుతున్నది. వారిని సిలిండర్ కు దూరం చేస్తున్నదని విమర్శించారు.ఉజ్వల స్కీం లో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా లబ్ధి పొందిన మొదటి మహిళా సైతం ఈరోజు సిలిండర్ ను కొనలేక కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నదని దుయ్యబట్టారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అడ్డగోలుగా సిలిండర్ ధరలను పెంచకుండా, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసారు.కాగా మహిళలు భారీ గా ధర్నా లో పాల్గొన్నారు. గత పాలకులు పట్టిన గతే బిజెపికి పడుతుందని వారన్నారు. ధర్నాలో పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు, సొసైటీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు,రైతు సంఘాల నాయకులు,మహిళా సంఘాల నాయకులు,టిఆర్ఎస్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.