బిల్లుపాడు లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామలో జెకె నగరం సెంటర్లు
లో గల టీడీపీ దిమ్మె వద్ద ఆదివారం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు పూలమాలవేసి టిడిపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. జక్కంపూడి చంద్రశేఖర్,ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నారపోగు ప్రసాద్,
జక్కంపూడి చంద్రశేఖర్
మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మహా నాయకుడు ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగింది. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండటం ఎన్టీఆర్ కి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం లో వేముల గోవిందు, జక్కంపూడి రమేష్,నాగేశ్వరావు పులపాల కృష్ణయ్య, రామకృష్ణ, కోటయ్య, కృష్ణయ్య, కృష్ణ, రాజేష్, మహేష్, మస్తాన్, సుబ్బారావు,
, టీడీపీ మండల నాయకులు.రామయ్య,. వెంకటేశ్వర రావు, కంత్రి, మహేష్, ప్రసాద్,నాయకులు . నాగయ్య, రాము, నరసింహారావు, నాగేశ్వరావు.లక్ష్మయ్య , శేషయ్య,
టీడీపి కార్యకర్తలు ఎన్టీఆర్ , జక్కంపూడి అభిమానులు ఎన్టీఆర్అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.