బీఆర్ యస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి ప్రత్యేక పూజలు
మండల పరిధిలోని గొండ్రియల గ్రామంలో స్థానిక శివాలయంలోని బీఆర్ యస్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గొండ్రియాల గ్రామ మాజీ సర్పంచ్ మండపల్లి వెంకటేశ్వారావు నివాసంలో బీఆర్ యస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ కార్యకర్తలతో పార్టీ అంతర్గత విషయాలు ఆడిగితెలుసుకున్నారు, బిఆర్ యస్ పార్టీ ప్రవేశపేట్టిన పథకాల గురుంచి గ్రామంలోని ఇంటిటికి ప్రతికార్యకర్త ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు, ఈకార్యక్రమంలో కోదాడ బీఆర్ యస్ నాయకులు లక్ష్మినారాయణ, మాజీ డిసిసిబి ముత్తారపు పాండురంగారావు,దండ వీరభద్రం,కోదాడ వర్డ్ కౌన్సిలర్ గుండపనేని నాగేశ్వరరావు, తుమ్మటి సురేందర్ రెడ్డి, నెట్టెం భార్గవ్,స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు