
బీటీ రోడ్లకు 92 కోట్ల 22 లక్షలు నిధులు మంజూరు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని రోడ్లు,భవనాల శాఖ అతిధి గృహంలో బుదవారం బి అర్ ఎస్ నాయకులు కొంపెళ్లి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్,ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు,డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన నియోజక వర్గ బి అర్ ఎస్ ముఖ్య నాయకులు.అనంతరం మీడియా సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ కు నియోజక వర్గ ప్రజలుగా మనమందరం రుణపడి ఉండాలన్నారు.మంత్రి నియోజకవర్గానికి 92కోట్ల 22లక్షల రూపాయలు బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేయించినారని,వాటిలో మరిపెడ మండలానికి 23 కోట్ల 32 లక్షల రూపాయలు ఒక్క మన మరిపెడ మండలానికి చేయించారని,మరిపెడ మండలం అంటే మంత్రికి చాలా ఇష్టమని,మరిపెడ మండల ప్రజలు మంత్రి సత్యవతి రాథోడ్ వెంటే ఉన్నారని అన్నారు.మంత్రి సత్యవతి రాథోడ్ మంజూరు చేయించిన అభివృద్ధి కార్యక్రమాలని ఎమ్మెల్యే మేమే మంజూరు చేయించామని,మావల్లే నియోజక వర్గం అంత అభివృద్ధి జరుగుతుందని చెప్పుకోవడం,శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారని అన్నారు.ఎవరు ఏమి చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.ఎమ్మెల్యే రెడ్యా నాయక్ విభజించి పాలించే విధానాన్ని మార్చుకోవాలని మేము ఇప్పుడు,ఎప్పుడూ బి అర్ ఎస్ పార్టీ నాయకులమెనని,మమ్ముల్ని విభజించి పాలిస్తున్న ఎమ్మెల్యే గెలుపులో మా అందరి పాత్ర చాలా ముఖ్యమైనదని,ఎమ్మెల్యే గెలుపుకు ఎంతో కష్ట పడ్డామని సమిష్టి కృషితోనే ఎమ్మెల్యే గెలుపు సాధ్యమైందన్నారు.కాంగ్రెస్ వలస వాదులకు,వారి దగ్గరి అనుచరులకు మాత్రమే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని,మంత్రి సత్యవతి రాథోడ్ వర్గమంటు మమ్ముల్ని,మా అనుచరులను,మా గ్రామాలకు అభివృద్ధి,సంక్షేమ ఫలాలకు మొండి చెయ్యి చూపిస్తు మమ్ముల్ని దూరం చేస్తున్నారన్నారు.ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు,ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ చేయలేదని ప్రచారం చేయడం,ఎద్దేవా చేయడం వారు ఇన్నాళ్లు రాజకీయ అనుభవం ఉండి అలా మాట్లాడడం వారి స్థాయికి తగినది కాదన్నారు.ఇప్పటికైనా వారి మనసు మార్చుకొని అందర్నీ కలుపుకొని పోయేలా,వర్గ విభేదాలు లేకుండా,కార్యకర్తల్లో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవలసిన భాధ్యత ఎమ్మెల్యే పై ఉన్నదని,లేనిచో రాజకీయంగా అసంతృప్తులు పెరుగుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మాజీ సర్పంచి రాంలాల్,గంధసిరి అంబరీష,మెంచు అశోక్ గౌడ్,తొట్టి శ్రీను,వేణు గోపాల్ రెడ్డి,భరత్ నాయక్, పసునుంటి మల్లారెడ్డి యాకూబ్,సూర్యా నాయక్,రాజు నాయక్,సర్పంచులు,ఎంపిటిసిలు,మండల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.