
telugu galam news e69news local news daily news today news
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ను గెలిపించి సోనియాకు బహుమతి గా ఇస్తాం డోర్నకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్. మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్. వరంగల్,నల్లగొండ,ఖమ్మం పట్టు బద్రులారా త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ప్రతి పట్టభద్రుడు దరఖాస్తు చేసుకోవాలని తీన్మార్ మల్లన్న అన్నారు. మంగళవారం రోజున డోర్నకల్ నియోజకవర్గం లోని మరిపెడ మండల కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా బిసి సంక్షేమ సంఘం,కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గుండగాని వేణు గౌడ్, మరగని బాలక్రిష్ణ గౌడ్ ఆధ్వర్యంలో క్యాలెండర్,డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన మల్లన్న మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పట్టబద్రుల ఓట్ల ద్వారా గెలిచిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సొంత లబ్ధి కోసమే పని చేశాడు తప్ప గ్రాడ్యుయేషన్ ఓట్ల ద్వారా గెలిచి నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఈసారి ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేషన్ చేసిన వారు దరఖాస్తు చేసుకొని అధిక మెజార్టీతో గెలిపియాలని అన్నారు. డోర్నకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ను పట్టభద్రుల ఎన్నికలలో అధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. కెసిఆర్ ను గడగడ లాడించిన ఘనత తీన్మార్ మల్లన్నది అని కొనియాడారు. కెసిఆర్,బిజెపి ప్రభుత్వలు ఒకటిగా నిలబడిన భయపడకుండా ఎదురు నిలబడి ఎదిరించిన ఘనుడు తీన్మార్ మల్లన్న.గత ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు చేరువేసిన ఏకైక వ్యక్తి తీర్మానం మల్లన్న అని డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. ప్రజల పక్షాన కొట్లాడే మల్లనన్ను గెలిపించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తీన్మార్ మల్లన్న ను గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గెలిపించి సోనియా గాంధీకి బహుమానంగా ఇస్తామని డాక్టర్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆదివాసి గిరిజన చైర్మన్ బెల్లయ్య నాయక్, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,కాలం రవీందర్ రెడ్డి,గుండ గాని వెంకన్న గౌడ్,ఖలీల్,పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్,ఐలమల్లు, బోర హరీష్ యాదవ్,జాటోత్ సురేష్ కుమార్, బీసీ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.