
telugu galam news e69news local news daily news today news
పెన్షన్లు రైతుబందు ఋణమాఫీ అన్ని హోల్డులోనే పెడుతున్నరు లావాదేవీల వివరాలు అడిగితే పైనుండి ఆర్డర్ రావాలంటున్నరు కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఏవిఎస్పి నాయకురాలు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే సమస్య మడకం సమ్మక్క, ఏవిఎస్పి మహిళా అధ్యక్షురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందిన వారు. వ్యవసాయ అవసరాల కోసం కొరకు ఆయా మండలాల పరిధిలోని ఎస్బిఐ, ఏపిజివిబి మరియు డీసీసీబీ సహకార బ్యాంకుల్లో ఖాతాలు పొంది ఋణ సదుపాయములు పొందుతున్నారు. అంతే కాకుండా ఇవే బ్యాంకు ఖాతాలను పెన్షను, రైతుబందు వంటి ప్రభుత్వ పథకాల ఆర్థిక సహాయాల కొరకు కూడా వినియోగించడం జరుగుతుంది. అయితే సదరు బ్యాంకు అధికారులు మాత్రం గిరిజనులపై వివక్ష చూపిస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు అధికారులు అమాయక గిరిజనులపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.వారికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలు ఏవి కూడా చెప్పడంలేదని గిరిజనుల యొక్క అమాయకత్వాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని హీనంగా చూస్తూ వారికి తెలియని అప్పులను చూపిస్తూ అమాయక గిరిజనులు యొక్క బ్యాంకు ఖాతాలను హోల్డులో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న వృద్ధ్యాప్య పెన్షను వితంతు పెన్షనులను సైతం ఇవ్వకుండా అప్పు పూర్తిగా కడితేనే అకౌంట్ హోల్డులోనుండి తీస్తామని వేధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబందు సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పి.ఎం కిసాన్ సహాయాలను కూడా ఇవ్వకుండా గిజనులను కొన్ని నెలలుగా బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. రైతు రుణమాఫీ గురించి అడిగితే మీకు రుణమాఫీ రాదని అప్పు మొత్తం కాట్టాలని లేకపోతే ఖాతాలలో ఉన్న ఒక్క రూపాయి కూడా బయటకు రాదని బెదిరిస్తున్నారు. బ్యాంకు అధికారులను లబ్దిదారుల ఖాతాల యొక్క స్టేట్మెంట్ వివరాలు అడిగితే ఒక్కో పేజీకి 100/- రూ. ల నుండి 250/- రూ.ల వరకు ఖర్చు అవుతుందని అధిక మొత్తంలో డబ్బు అడుగుతున్నారని లేదంటే బ్యాంకు స్టేట్మెంట్ ఇవ్వడానికి పైనుంచి అనుమతులు రావాలంటూ అమాయకులైన గిరిజనులను బ్యాంకుల నుండి వెళ్లగొడ్తున్నారని గిరిజనులు వాపోతున్నారు.