
బ్యాంకులో ప్రతి ఖాతాదారుడికి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి
బ్యాంకు ఖాతాదారులు అందరూ బ్యాంకు నుండి ఇస్తున్న ఇన్సూరెన్స్ అందరూ జాయిన్ కావాలని ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు అన్నారు శనివారం తల్లాడ ఏపీజీవీబీ బ్యాంకులో అన్నారుగూడెం గ్రామానికి చెందిన సాంబత్తిని లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఆమెకు బ్యాంకులో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద రెండు లక్షల రూపాయలు చెక్కును ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బ్యాంకు అధికారులు నామినీగా ఉన్న సాంబత్తిని బాలస్వామికి చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ శివ సతీష్ క్యాషియర్ రవికుమార్ అకౌంటెంట్ భాగ్య బ్యాంకు మిత్ర తాళ్లూరి వెంకటరమణ తదితరులు హాజరయ్యారు