
భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీ క్రమశిక్షణకు మారుపేరు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో ని ఒక వ్యవసాయ క్షేత్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్ మాట్లాడుతూ ఈరోజు ఎమ్మెల్యే గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్పందిస్తూ అవకాశం కోసం ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాలరాస్తున్నారు మీరు ఆలోచిస్తే అర్థంకాదా.?ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు తలపెడుతున్నారో తెలుసుకునే జ్ఞానం మనకు లేదా.? బంగారు తెలంగాణా నిర్మాణం దిశగా అడుగులు వేస్తుంటే మరోవైపు స్వపక్చంలో విచ్ఛిన్ననికి కుట్రలు జరుగుతున్నాయి, డోర్నకల్ ను మళ్లీ ఆగం చేయడానికి కొన్ని దుష్టశక్తులు ఏకం అవుతున్నాయి. కొందరు కావాలని పనిగట్టుకొని చేస్తున్నారు. అస్థిత్వాన్ని దెబ్బతీయడానికి కుయుక్తులు పన్నుతున్నారు,దొంగచాటుగా మద్దతు ఇస్తుంటే చూస్తూ ఉండాలా, అడ్డదోవలో ఇక్కడి ప్రజలను మళ్లీ బానిస బతుకుల్లోకి నెట్టాలని చూస్తున్నారు,అందుకు స్వాపక్షంలోని విపక్షం వేదికగా కుట్రలు జరుపుతున్నారు. ఎవ్వరూ ఎన్ని కుట్రలు చేసినా డోర్నకల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండా నే, గెలిచేది రెడ్యానాయక్ ఏ, ప్రశాంతంగా అభివృద్ధిపథంలో, అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నియోజకవర్గాన్ని ఛిన్నాభిన్నం చేసే శక్తులు పెరిగిపోతున్నాయి. వాటికి అవకాశం ఇవ్వాలా.? అన్నిరంగాల్లో బ్రహ్మాండంగా డోర్నకల్ నియోజకవర్గన్ని ముఖ్యంగా మరిపెడను అభివృద్ధి చేసుకుంటున్నం. ఇప్పుడిప్పుడే బిఆర్ఎస్ కార్యకర్తల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. వారి అనుచరులకే పదవులు ఇస్తున్నారు అంటున్నారు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చే వ్యక్తి రెడ్యా నాయక్ ఆ వర్గం ఈ వర్గం అనేది ఏమీ చూడరు, అన్ని రంగాల్లో ఇతర ప్రాంతాలకన్న మన దగ్గర ఎమ్మెల్యే రేడ్యా నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గం సుభిక్షంగా మారడం చూసి స్వాపక్షంలోని విపక్షం గా తయారు అయ్యారు, ద్వేషం, కుళ్లు, కుతంత్రాలతో అవకాశం కోసం వెతుకుతున్నారు, ఇక్కడే ప్రజలు ఆలోచించాల్సి అవసరం ఉంది,ఇన్ని ఏళ్లుగా లేని ప్రెస్ మీట్లు, దొంగచాటు మంతనాలు డోర్నకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటన తర్వాతే ఎందుకు, ఈ మీటింగ్ లతో ఎవరికి లాభం.? ఎవరికి నష్టం.? తన అవకాశం, స్వార్ధం కోసం ప్రజలకు నష్టం జరిగినా పర్వాలేదనే ఆలోచన ఎంతవరకు సబబు.?ప్రజలు నష్టపోయినా, గ్రామం, మండలం, నియోజక వర్గం, జిల్లా వెనకపడిపోయినా పర్వాలేదు. కానీ తమ పెత్తనం కోసం ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు, ఎంతకైనా దిగజరుతరు,ఇదేనా ప్రజాసేవా.?ఇదేనా క్రమశిక్షణ,
ధైర్యంగా చేసిన పనులు చెప్పుకుంటు ప్రజల మధ్య ఉంటూ, ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, పరిష్కారం చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇతర నియోజకవర్గాల నాయకులకు ఆదర్శమవుతున్నరు, ఎమ్మెల్యే రేడ్యా నాయక్ లాంటి నాయకుడికి ఎదురొస్తే ఎలా ? విమర్శించే హక్కు ఈ నాయకులకు ఉందా,అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని ప్రతి సభలోనూ చెబుతూనే ఉన్నారు,ఇది రేడ్యా నాయక్ మీదనో ఆయన పరిపాలన మీదనో జరుగుతున్న దాడి కాదు,మరిపెడ మరియు డోర్నకల్ నియోజకవర్గ ప్రజల భవిష్యత్ పై జరుగుతున్న దాడిగా తెలుసుకోవాలి. ఇలాంటి సమయంలోనే ప్రజలు తమ ఆలోచనకు పని చెప్పాలి, ఎవరి వల్ల మనకు నష్టం కలుగుతుందో అర్థం చేసుకోవాలి,ఎవరి పక్కన ఉంటే మంచి జరుగుతుందో తెలుసుకోవాలి,ఎవరి తప్పుడు మాటలు వింటే ఏం జరుగుతుందో గ్రహించాలి, మోసపోతే గోస పడతామనే విషయం మనం గ్రహించి, తోటి వారికి తెలియజేయాలి.వర్గాలుగా వేరుగా ఉన్న క్రమశిక్షణ గల బిఅర్ఎస్ కార్యకర్తలుగా ఒక్కటిగా ఉందాం.నియోజక వర్గ అభివృద్ధికి కృషి చేద్దాం, ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొనకుడదని క్రమశిక్షణ కల్గిన కార్యకర్తలుగా ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రంపెల్లి రవి గౌడ్, మరిపెడ మండల ఎస్టి సెల్ అధ్యక్షులు అజ్మీరా రెడ్డి నాయక్,రైతు కో ఆర్డినేటర్ గుగులోతు నరేందర్ నాయక్, మార్కెట్ కమిటీ డెరైక్టర్ గoట్ల మహిపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ దుస్సా నర్సయ్య ముదిరాజ్,గౌడ సంఘం నాయకులు గంధసిరి కృష్ణ, చిప్పరపల్లి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.