ఈ నెల 26 నుండి హన్మకొండ జిల్లాలో జరిగే హాత్ సే హాత్ జోడో పాద యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని కోరిన నాయిని.. పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికార పార్టీ నాయకులు తమ అంగబలంతో అర్ధబలంతో ప్రజలను భయబ్రాంతులను చేసి భూకబ్జాలు చేస్తున్నారని, ఇటీవలే వరంగల్ పశ్చిమలో MLA వినయ్ భాస్కర్ అనుచరుడు కార్పోరేటర్ వేముల శ్రీనివాస్ భూకబ్జ విషయం మనం వార్త పత్రికల్లో చూసాం. ఇప్పటికి ఇంకా అధికార ప్రజాప్రతినిధి కనుసన్నలో ఈ భూకబ్జా ధందా సాగుతుందని రెవిన్యూ మరియు పోలీస్ అధికారులను అడ్డంపెట్టుకొని తమకు అడిగే వారేలేరంటూ కార్పొరేటర్ల ద్వారా భూదందాలు చేయిస్తున్నారని పేర్కొనడం జరిగింది,కాబట్టి ఈ భూకబ్జాదారుల నుండి బాదితులను రక్షించి వారికి న్యాయం చేయడానికి ACP స్థాయి ప్రత్యేక అధికారిని నియమించి భూకబ్జాదారుల ఆగడాలను అరికట్టాలని వరంగల్ పోలిస్ కమీషనర్ గారికి వినతి పత్రం సమర్పించారు.రాహుల్ గాంధీ పాద యాత్ర విజయవంతమైన సందర్భంగా దానికి కొనసాగింపుగా ఏఐసిసి హాత్ సే హాత్ జోడో యాత్రను దేశ వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 26 నుండి హన్మకొండ జిల్లలోని ప్రతి నియోజకవర్గంలో, డివిజన్ లో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుందని కాబట్టి ఈ హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు పోలీసు పెర్మిషన్ ఇవ్వాని పోలీస్ కమిషనర్ గారిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమలో వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్ తరిదితరులు పాల్గొన్నారు.