
భోజన ప్యాకెట్లు మరియు వాటర్ బాటిళ్లను పంపిణీ చేసిన నాయిని
హన్మకొండ 54 వ డివిజన్ పోచమ్మకుంటలో జలమయమైన కాలనీలో పరిశీలించి ప్రజలకు భోజన ప్యాకెట్లు మరియు వాటర్ బాటిళ్లను పంపిణీ చేసిన నాయిని..
హన్మకొండ 54 వ డివిజన్ పోచమ్మ కుంటలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు జలమయమైన కాలనీలో పరిశీలించి ప్రజలకు భోజన ప్యాకెట్లు మరియు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
నగరంలోని సగానికి పైగా కాలనీలల్లో ఇదే దుస్థితి.
ప్రతి సంవత్సరం ఇదే తంతు.
శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవు.
నగర అభివృధి పై ఒక ప్రణాళిక లేని ప్రభుత్వం .
నాలాలపై అక్రమ కట్టడాలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వర్షాకాలంలో కాలనీలు మునుగుతున్నయ,
రాష్ట్ర ప్రభుత్వానికి పట్టణ ప్రణాళికపై చిత్తశుద్ధి లేదు.
నాలాపై ఎఫ్.టి.ఎల్ పై కబ్జా చేస్తున్న వారిపై
ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, గ్రేటర్ పాలకులు, ఎమ్మెల్యేనే ఈ పరిస్థితి కారణం .
గతంలో రెండుసార్లు నగరానికి ఈ పరిస్థితి వచ్చిందని తెలిసి కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదు.
వేలకోట్ల రూపాయల అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న నాయకులరా మీరు చేసిన అభివృద్ధి ఏదని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, AIUWC జిల్లా అధ్యక్షురాలు గుంటి స్వప్న, జిల్లా INTUC జిల్లా అధ్యక్షులు కూర వెంకట్, సీనియర్ నాయకుడు నల్లా సత్యనారాయణ, తౌటి రెడ్డి రవీందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, జిల్లా NSUI అధ్యక్షుడు పల్ల కొండ సతీష్, సుమన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.