
మంత్రులు, MP, MLA అసమర్ధత వల్లే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై చేతులేత్తెసిన కేంద్రం..నాయిని
రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను తీసుకురావడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం..
ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం లోనే కాలం వెల్లదీస్తోన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..
మాటలతో మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం..
మంత్రులు, MP, MLA అసమర్ధత వల్లే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై చేతులేత్తెసిన కేంద్రం..నాయిని..
రాష్ట్ర విభజన చట్టంలో 13 షెడ్యూల్ 10 వ అంశంగా తెలంగాణా రాష్ట్రానికి కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ లో యుపి.ఎ. ప్రభుత్వం నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చట్టం చేసారు.
TRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏండ్లు గడుస్తున్న8 సంవత్సరాలు BJP తో కాపురం చేయడానికి సరిపోయింది.
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై చేతులేత్తెసిన కేంద్రం
కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ హామీని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది.
తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని కేంద్రం స్పష్టం చేసింది.
భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా.. కోచ్ల తయారీ సామర్థ్యం ప్రస్తుతానికి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
విభజన చట్టంలో పొందుపరచిన ఏ ఒక్క అంశాన్ని మీరు పూర్తి చేసారా ?
రైల్వే కోచ్ ఫాక్టరి ఎక్కడ, మెడికల్ కాలేజీ, ట్రైబల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఎక్కడ ?బయ్యారం గనులు ఎక్కడా ?
ఈ 9 ఏండ్ల లో పార్లమెంట్ లో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని తెరాస నాయకులు అడిగారా ? ఇది TRS నాయకుల అసమర్ధత కాదా ?
మీరు ప్రజలకు జవాబు చెప్పాలి.
రాష్ట్ర విభజన జరిగి 9 ఏండ్లు గడుస్తున్న విభజన చట్టంలో పొందుపరచిన ఏ ఒక్క అంశం అయిన ముందుకు తీసుకెల్లారా ?
ఆ రోజు పంజాబ్ లో అల్లకల్లోలం జరుగుతుండగ ఉగ్రవాదం పెల్లు బికి మరో కాశ్మీర్ కాకుండా దేశ ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు దృష్ట్యా మనకు శాంక్షన్ అయిన కోచ్ ఫ్యాక్టరిని పంజాబ్ కు తరలించడం జరిగింది.
కాంగ్రెస్ హయంలో కోచ్ ఫ్యాక్టరీ గురింది ఆ రోజు పొన్నాల లక్ష్మయ్య గారు దేవాదాయ శాఖా మంత్రిగా. ఎంపి గా సిరిసిల్ల రాజయ్య ఉన్నప్పుడు 18కోట్లు శాంక్షన్ ఇచ్చి పెట్టి 54 ఎకరాలు భూమిని అక్వేర్ చేయడం జరిగింది.
కాజిపేట రైల్వే కోఅచ్ ఫ్యాక్టరీ రాకపోవడం, POH తరలింపు ఇది ఖచ్చితంగా MLA వినయ్ భాస్కర్ అసమర్ధత కాదా ? పాలకుల పట్టింపు లేని నిర్లక్ష్యం అని వేరే చెప్పా నక్కర లేదు.
కాని TRS నాయకులు ప్రతిసారి ప్రెస్ మీట్ లు పెట్టి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మేం పోరాడుతున్నం అనుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీరు పోరాటం చేయకుండా ఉంటె ప్రతిపక్ష పార్టీ గా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి పోరటం చేస్తే మీరు అధికారంలో ఉంది మమ్ములను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం వాస్తవం కాదా ?
మరి మీరు పోరాటం చేస్తే ఈ 9 ఏండ్లలో ఏమి చేసారో MLA వినయ్ భాస్కర్ ప్రజలకు జవాబు చెప్పాలి?
TRS ప్రభుత్వం ఏర్పడ్డాకా కాజిపేట ప్రాంతం నిర్వీర్యం అయింది. ఏనాడు కాజీపేట ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు.
తెలంగాణా ఉద్యమంలో ఎవరి పాత్ర వారు చేసారు ? MLA వినయ్ భాస్కర్ నువ్వు ఒక్కడివే ఉద్యమం చేసావా? మేం చేయలేదా ఉద్యమం ? అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే తెలంగాణా వచ్చేదా ?
మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మేము అభివృద్ధిపై ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తాం మీరు జవాబు చెప్పాలని అంటే నా స్థాయి కాదు అంటాడా MLA వినయ్ భాస్కర్ ?
నువ్వు స్థాయి గురించి మాట్లడితే నేను ఒప్పుకుంటున్న మరి నీ అంత స్థాయి నాకు లేదు ఎందుకంటే నువ్వు భూములు కబ్జా చేసినోడివి నీకు ఎదురు తిరిగితే కేసులు పెట్టినోడివి, ప్రజల సొమ్ము దోచుకున్నోడివి.
అందుకే నువ్వు ప్రజలకు ఇచ్చిన హమీలపై జవాబు చెప్పలేక పోతున్నావు ? మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక వక్రబుద్ధితో నీ తోత్తులతో లంపెన్ గ్యాంగ్ తో నాపై అసత్యప్రచారం చేస్తున్నావ్. అని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, గ్రేటర్ మైనారిటీ కాంగ్రెస్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, జిల్లా IT వింగ్ చైర్మన్ వింజమూరి లక్ష్మి ప్రసాద్, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తీక్, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, మేకల ఉపేందర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బంక సంపత్, టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహాల్, టిపిసిసి ఒబిసి డిపార్టుమెంటు కార్యదర్శి ఇప్పా శ్రీకాంత్ ఒబిసి డిపార్టుమెంటు, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ చైర్మన్ నల్ల సత్యనారాయణ, గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.