(వరంగల్ క్రైమ్)03ఏప్రిల్:ట్రాఫిక్ నిబంధనలుకు విరుద్ధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులకు గురువారం కోర్టు జరిమానా విధించింది. వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…నగర కమీషనర్ సన్ ప్రిత్ సింగ్ ఆదేశాల మేరకు ఏసీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీ లో భాగంగా మద్యం తాగి పట్టుపడిన 23 మంది వాహన దారులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపిన వాహన దారులను మంగళవారం హన్మకొండ కోర్టులో జడ్జి అబ్బోజు వెంకటేశం హాజరు పర్చగా పర్వతగిరి కి చెందిన మంతుర్తి కుమారస్వామి (35) రెండు వేల జరిమానా, మూడు రోజులు మరియు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన సైదాపురం కరీంనగర్ కు చెందిన పొడి శెట్టి లక్ష్మణ్ కుర. 500 3రోజులు జైలు శిక్ష విధించారు.. మిగితా 22 మందికి రూ.26500/- జరిమానాను విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు..