
మునగాల:- మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చల కూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎం ఈ ఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు చేపట్టిన సమ్మె లో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వంట వండి పెడుతున్న గౌరవ వేతనం పేరుతో 1000 రూపాయలు ఇస్తూ వారితో ఎట్టి చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో కార్మికుల పోరాట ఫలితంగా రూ 2000 లు పెంచడం జరిగింది. అవి నేటికీ అమలు గాక 8 నెలలు కావస్తున్నది కార్మికులకు పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బిల్లులు రాక అప్పులు చేసి కార్మికులు విద్యార్థులకు వంట చేసి పెడుతున్నన్నారు.సమస్యలు పరిష్కరించకపోవడంతో నీరవాదిక సమ్మెను కొనసాగిస్తామని అన్నారు
మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘం మండల అధ్యక్షురాలు ధనమ్మ కార్యదర్శి బచ్చలకూర మంగమ్మ కె సరోజన, నాగమ్మ లింగమ్మ, బొందమ్మ, L సరోజన, నరసమ్మ,కె ప్రమీల, ధనలక్ష్మి, బి సరోజన,మనీ, డి లక్ష్మి, అరుణ, ఖాజాబీ, తదితరులు పాల్గొన్నారు.