
telugu galam news e69news local news daily news today news
ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దాం
ఎం.ఈ.ఓ కు సమ్మె నోటీసు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుదామని, ఫిబ్రవరి 16న జరిగే సార్వత్రిక సమ్మె మరియు గ్రామీణ బందును జయప్రదం చేద్దామని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబీ నర్సారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి లు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు భద్రాచలం మండల ఎంఈఓ సమ్మయ్యకు సమ్మె నోటీసును అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మె మరియు గ్రామీణ బంధు కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా భాగస్వామ్యం అవుతారని, ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి నిర్వీర్యం చేసిందని అన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించే విధంగా చట్టం చేయాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నాలుగు నెలలుగా చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, గత రెండు నెలలుగా కార్మికులకు ఇవ్వవలసిన జీతాలు వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం కార్మికులు పనిచేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా సమ్మె నోటీసులు అందడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు పి శివమ్మ, ఎం రాజేశ్వరి, ఎం సత్యవేణి, సిహెచ్ రమాదేవి, సిహెచ్ దమయంతి, అక్కల జ్యోతి, లక్ష్మి, నాగమణి, సుధా తదితరులు పాల్గొన్నారు..