మన బిఆర్ స్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి
కాంగ్రెస్ రెండేళ్ల పాలన తేలిపోయింది.
అమలుకు నోచుకొని ఆరు గ్యారెంటీలు
కల్యాణలక్ష్మి తులం బంగారం ఏది..?
ఆడబిడ్డలకు రూ.2500 ఇచ్చారా అంటూ మహిళకు ప్రశ్న.
మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్
కాంగ్రెస్ రెండేళ్ల పాలన తేలిపోయిందని ఆరు గ్యారెంటీలు అటుకెక్కినట్లు మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆరోపించారు. ఆదివారం మరిపెడ మున్సిపల్ కేంద్రం లోని వివిధ వార్డుల్లో ఆయన పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి ఆయా వార్డుల ప్రజలు , పార్టీ శ్రేణులతో మాట్లాడారు. రెండేళ్ల పాలన ఎలా ఉందో ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఎంత మందికి అందిందని.? ప్రతి ఇంటి ఆడబిడ్డకు రూ.2500లు?ఆసరా పింఛన్లు రూ4వేలు,అంగవైకల్యం కలిగిన వారికి రూ.6000వేలు ఎక్కడైనా ఇచ్చారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. దీంతో మహిళలు లేదంటూ సమాధానం ఇచ్చారు. రైతు బంధు పథకం రూ.15000వేలు ఇవ్వటం లేదని పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదని రెడ్యా నాయక్ విచారం వ్యక్తం చేశారు.మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు, మనం చేసిన పనులనే ఈ ప్రభుత్వం మళ్లీ చేసి మేమే చేస్తున్నామంటున్నారు,రెండు సంవత్సరాల పాలన లో కాంగ్రెస్ తన అసమర్ధత ను నిరూపించుకున్నారు. అధికారం కోసం అమలకు సాధ్యం కానీ 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక పోతుందన్నారు.డోర్నకల్ నియోజకవర్గం స్థానికేతురుల పాలన లో వెనుకబాటుకు గురైందని విచారం వ్యక్తం చేశారు. మరిపెడ పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న దృడ సంకల్పంతో పురపాలక కేంద్రం గా ఏర్పాటు చేసి కోట్లాది నిధులు మంజూరి చేసి సుస్థిరమైన ప్రగతి సాధించేలా కృషి చేసినట్లు తెలిపారు. పట్టణ కేంద్రలో వంద పడకల ఆసుపత్రి మంజూరి చేయించి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో శంకు స్థాపన చేయించినట్లు పేర్కొన్నారు. మరిపెడ లో సబ్ కోర్టుమంజూరి చేసి స్థల పరిశీలన చేశామని పేర్కొన్నారు.అనునిత్యం ప్రజలకు అందుబాటు లో ఉండి అభివృద్ధి లక్ష్యంగా పని చేశానని స్పష్టం చేశారు. డోర్నకల్ పరాయి పాలన లో అన్ని వర్గాల్లో వెనుకబాటుకు గురవుతుందని ఇది తనకెంతో ఆవేదన కలిగిస్తుందన్నారు.రానున్న పురపాలిక ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మన పాలన మనం చేసుకుందని ఓటర్లను అభ్యర్థించారు. అందుబాటు లో ఉండేది అభివృద్ధి చేసేది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, మాజీ ఒడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,జిల్లా నాయకులు గుగులోతు రాంబాబు,తేజవాతు రవీంద్ర నాయక్, ఉగ్గంపల్లి సర్పంచ్ ఆయుబ్ పాషా,పానుగోతు వెంకన్న, జాతోటు బాలాజీ, మాచర్ల భద్రయ్య, ఎల్వి వెంకన్న, సయ్యద్ లతీఫ్, మక్సుద్,దిగజర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.