
మరోసారి మోసపోకండి
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే లక్ష్యంగా గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాసనసభాపక్ష నేత, స్థానిక శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో దెందుకూరు గ్రామం నందు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు అధ్యక్షతన బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మధిర మండల బూత్ కమిటీల ఇన్చార్జ్ బండారు నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చావా వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి కెసిఆర్ అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ప్రజలు ముఖ్యమంత్రి ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసేది కాంగ్రెస్ పార్టీ అని మధిర నియోజకవర్గ శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం 1360 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర రాష్ట్రం మొత్తం నిర్వహించి ప్రజల బాధలు తెలుసుకున్నారు, ప్రజల సమస్యలు విని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తారన్నారు.. ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్న BJP – BRS పార్టీలు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. కూరగాయలు, పప్పులు, పిండి, బియ్యం, పాలు, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. దీనికి తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ రెండూ బాధ్యులే ఈ కష్టాల నుంచి ప్రజలు బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే ఏకైక లక్ష్యం అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకే గ్యాస్ బండని ప్రజలకు అందజేయడం జరుగుతుంది అన్నారు మరియు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అన్నారు మరోసారి కేసీఆర్ మాటలు విని మోసపోకండి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన పల్లెలను,రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు. ఈ సమావేశంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చిరామయ్య పగిడిపల్లి డేవిడ్ నిడమనూరి వంశీకృష్ణ దెందుకూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఊట్ల రాంబాబు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్లపూడి అప్పారావు, రాచకొండ వెంకటేశ్వర్లు, ఊస భాస్కరరావు, బొంగరి శ్రీహరి, భూక్య శ్రీకాంత్, యడ్లపల్లి వెంకటకృష్ణ, పగిడిపల్లి సంజీవ్, ఐతం ప్రసాద్, రాచకొండ వెంకటేశ్వరరావు, గుగులోతు లక్ష్మణ్, ఎడ్లపల్లి నాగయ్య, కాజా కృష్ణ, హోస భాస్కరరావు, సుగ్గల రాంబాబు, దొంగర శ్రీహరి తీర్థాల శీను, కర్లపూడి అప్పారావు, దమ్మాలపాటి పురుషోత్తరావు, నండ్రు నాగార్జున, రెంటపల్లి శీను, కొండ, విజయరావు మొదలవారు పాల్గొన్నారు.