మహబూబాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆశా కిరణం, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మునిసిపల్ & ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కు ఘనంగా, బోనాలు, బతుకమ్మలతో, గుస్సాడీ నాట్యం, తో కళాకారుల ఆటపాటలతో స్వాగతం పలికారు, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాలోని గుమ్మడూరులోని రామచంద్రాపురం కాలనీలో 200 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇంటిపేపర్లను అందజేశారు. అంతకుముందు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రూ.50 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం రూ.5 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్, ఫ్రూట్స్, ఫ్లవర్ మార్కెట్లను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మలి దశ ఉద్యమంలో సమైక్య పాలకులను తరిమికొట్టిన నేల ఈ మానుకోట, అందుకే సీఎం కెసిఆర్ , మహబూబాబాద్ ను జిల్లా కేంద్రం చేశారు, ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎలా వుందో ప్రజలు ఒక్కసారి విశ్లేషించుకోవాలి, సమైక్య పాలనలో అసలు ఇక్కడ అభివృద్దే జరగలేదు, మహబూబాబాద్ జిల్లా ఏర్పడ్డాక ఊహించని అభివృద్ది జరిగింది, జరుగుతుంది.జిల్లాలో అటవీ ప్రాంతం వున్నది, అందరి బాగు గురించి ఆలోచించే సీఎం కేసిఆర్, ఎన్నో ఏళ్లుగా గిరిజనుల పోడు భూముల సమస్య వుండేది, అందుకే గిరిజనులకు కోడ్ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ల పాలనలో ఎక్కడ కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు అన్నారు, గిరిజనులు అంటే అపారమైన ప్రేమ కలిగిన సీఎం కెసిఆర్ ఒక దారి చూపారు, అలాంటి సమస్యకు అటవీ హక్కుల చట్టం ద్వారా పరిష్కారం చూపారు, ఈ రోజు నుండి రాష్ట్రంలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమం సీఎం కెసిఆర్ ప్రారంభించారు. మన మహబూబాబాద్ జిల్లా లో, కేటీఆర్,ప్రారంభించారు.రాష్ట్రంలో 1 లక్ష 51 వేల 146 మంది గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తున్నాం, మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా మహబూబాబాద్ జిల్లా లో పోడు భూములకు పట్టాలు, జిల్లాలో 24 వేల 181 మంది లబ్ది దారులకు సంబందించిన 67 వేల 730 ఎకరాలకు పోడు పట్టాల పంపిణి చేస్తున్నాం,ఇప్పటికే జిల్లాలో సుమారు 33 కోట్ల 86 లక్షల రైతుబంధు సహాయం కూడా వానాకాలం 2023 పంట కాలానికి అందించబడింది అన్నారు , ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం మేరకు 1 లక్ష 51 వేల 146 మంది కొత్త గిరిజన పోడు పట్టాదారులకు కూడా రైతుబంధు పంట పెట్టుబడి సహాయం ఇస్తున్నాం అన్నారు. 1 లక్ష 51 వేల 146 పోడు పట్టాదారులకు రైతుబంధు లబ్ది
వానాకాలం, 203 కోట్ల 18 లక్షలు
యాసంగి, 203 కోట్ల 18 లక్షలు, మొత్తం 406 కోట్ల 36 లక్షలు, ఇంత చేస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి ఆశీర్వదించాలి అని మంత్రి కోరారు ,సీఎం కెసిఆర్, ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి చేసుకున్నాం అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు, జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కేసీఆర్ కి మనం రుణపడి ఉండాలి, 3,146 తండాలను గూడాల ను గ్రామపంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుంది, గతంలో కనీసం మంచి నీళ్లు దొరకని పరిస్థితి గూడాలలో ఉండేది, మహబూబాబాద్ లో 500 కోట్ల తో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నారు, కాంగ్రెస్ పాలకుల విమర్శలు, కుట్రలు తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది,మహబూబాబాద్ లో మున్సిపాలిటీ 50 కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారు, నేను, సత్యవతి రాథోడ్ కలిసి ఈ ప్రాంత విజయాని కృషి చేస్తామని కేటీఆర్ మాట ఇస్తున్నారు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక, లోకల్ బాడీస్ కలెక్టర్ అభిలాష అభినవ్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యా నాయక్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, జెడ్పి చైర్మన్ కుమారి బిందు,మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, స్థానిక ఎంపీపీలు, జడ్పిటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.