
కుట్రగానే భావించాలంటున్న పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ
మహిళల హక్కు” అనేపదానికి “రిజర్వేషన్” అనే పదాన్ని ఉపయోగించటం ఆక్షేపనీయమే కాక మహిళలపై వివక్షే అవుతుంది. ఇది మహిళలను కించపరచడమే కాక ముమ్మాటికీ అన్యాయానికి, అధర్మానికి మహిళలను బలి చేయడమే అవుతుందని “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” మహిళల తరఫున చెప్తున్నది. ప్రకృతిలో పురుషులు ఎంతో మహిళలు కూడా అంతే. పురుషులతో సమానంగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడం మహిళల హక్కు. మరియు చట్టసభలలోనే కాక అన్నిటిలో కూడా సగభాగం పొందటం మహిళల హక్కు. ఈ విషయాన్ని ప్రస్తుత రాజకీయ పార్టీల వారు మరిచిపోయి,
మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు, (33%) శాతం రిజర్వేషన్ అమలు చేయాలి, అనే బిల్లు ను తీసుకువచ్చి ఆమోదించడం అజ్ఞానమే కాక మూర్ఖత్వంగా భావించాలి. కావున “చట్టసభలలో ఉన్న ప్రజాప్రతినిధులు” ఏవైతే చేయాలనుకుంటున్నారో ఆ చేయాలనుకుంటున్న పనులలో, తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న
లోపాలను సరి చేయకపోతే అవి తప్పుగా మారును. ఆ తప్పును కూడా సరి చేసుకోకపోతే నేరముగా మారును. ఇక నేరం చేసిన (జరిగిన) తర్వాత శిక్షను అనుభవించక తప్పదు. ఇదే కదా ప్రకృతి నియమం మరియు ధర్మం. అలాంటప్పుడు మహిళల “హక్కు” అనే స్థానంలో “రిజర్వేషన్” అనే పదాన్ని పెట్టడం వివక్షే కాదు ఓ కుట్రగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ పేర్కొంటున్నది. మహిళలు లేకుండా మానవజాతి విస్తరించడం అనేది సాధ్యపడదు. ప్రకృతిలో పురుషులు ఎంతనో మహిళలు కూడా అంతే!. కావున ఇద్దరికీ సమాన స్వేచ్ఛ, స్వతంత్రాలు, హక్కులు, హోదా, గౌరవ మర్యాదలు, రక్షణ, భవిష్యత్తు, న్యాయము, ధర్మము లాంటివి కూడా సమానంగా ఉండును. అప్పుడే మనము మానవత్వం, మానవ విలువలు, మానవ సంబంధాలతో “ప్రేమ” వైపు ప్రయాణిస్తూ స్థిరంగా, దృఢంగా, నిచ్చలంగా, సుఖశాంతులతో జీవించగలము. లేనిచో మోసము, ద్వేషము, ఆధిపత్యము, వివక్ష, చిన్న చూపు, చులకన భావము లాంటివి జీవం పోసుకొనును. ఆ తర్వాత మన అస్తిత్వానికే ముప్పు ఏర్పడును అని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ చెప్తున్నది. ఇప్పటికే ఎంతగానో మహిళలు అన్యాయానికి, అధర్మానికి, మోసానికి, వంచనకు, పురుషాదిపత్యానికి బలైపోయారు. అందుచే “మహిళా రిజర్వేషన్ 33% బిల్లు” అనే స్థానంలో “మహిళల హక్కు సగభాగము” అనే బిల్లుగా పేరును మార్చి చట్టం చేయాలని, “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” సవినయంగా మహిళల తరఫున చట్టసభలలో ఉన్న ప్రస్తుత రాజకీయ పార్టీల వారికి చెప్తున్నది. అంతేకాక మనలో ఆత్మీయతలు చిగురించి, వికసించాలంటే తప్పనిసరిగా మహిళలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వారి హక్కులతో వారు జీవించే విధంగా దృఢమైన చట్టాన్ని రూపొందించటం తప్పనిసరి. కావున “మహిళలకు 33% రిజర్వేషన్” అనే స్థానంలో “మహిళల హక్కు సగభాగం” అనే పేరుతో చట్టాన్ని తీసుకురావాలని పదే పదే “పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ” నిర్మోహమాటంగా ని సందేహంగా మహిళల తరఫున చెప్తూ ముగిస్తున్నది