
మహిళా శక్తి ఆధ్వర్యంలో సంచార చేపల విక్రయ వాహనం
గీసుగోండ మండలం కొనయమాకుల రైతు వేదిక వద్ద సంగెం మండలానికి ఇందిరా మహిళా శక్తి ద్వారా మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.
మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారని అన్నారు. చేపల విక్రయ వాహనం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రాబోయే రోజుల్లో మహిళా సంఘాల అభివృద్ధి కోసం మరిన్ని సహాయక కార్యక్రమాలు చేపడతామన్నారు.