bhadradri kothagudem news
ఎమ్మెల్యే : తెల్లం వెంకట్రావు
గళం న్యూస్ / దుమ్మగూడెం సెప్టెంబర్24
దుమ్మగూడెం మండలం ఆర్లగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కోర్స రమేష్ గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ హఠాత్ మరణం కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచివేసింది. కొర్స రమేష్ మొదటిసారి సిపిఐ పార్టీ నుండి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు పదవీకాలం అయినా 2006 – 2011 లో పంచాయతీ పరధి లో ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన పనులు చేశారని, ఒక నిస్వార్థ యువ నాయకుడిని ఆర్లగూడెం పంచాయతీ కోల్పోయిందని పార్టీ శ్రేణులు విచారం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు రమేష్ పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు, మాజీ జెడ్పిటిసి సీతమ్మ, మట్ట శివాజీ, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.