
mulugu news
-ప్రజా పాలన లో తీసుకున్న ప్రతి దరఖాస్తు డేటా ఎంట్రీ చేస్తారు
-అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం
-ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
శనివారం రోజున వెంకటాపూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు చూసి భయపడి మాపై దుష్ప్రచారం చేస్తున్నారు
అధికారం లేకుండా బీఆర్ఎస్ నాయకులు బతకలేకపోతున్నారు
బీఆర్ఎస్ పార్టీ ఫ్యూడల్ పార్టీ
ఏకకాలంలో రుణమాఫీ అన్నారు? ఏమైంది?
పదేండ్లు దోచుకున్న దోపిడీ దొంగలు, 420 బీఆర్ఎస్ అనే ప్రజలు వాళ్ళని ఓడగొట్టారు
ప్రజాస్వామికంగా మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కూల్చేస్తాం, పేలుస్తాం అంటున్నారు
ఆటో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో నిరసనలు చే
ఉచిత బస్సు ఆలోచన రాగానే ఆటో డ్రైవర్లతో మాట్లాడిన తర్వాతనే మేనిఫెస్టోలో పెట్టాం
బీఆర్ఎస్ పార్టీనే 420 పార్టీ
బీఆర్ఎస్ దొచుకున్నదంతా బయటకి వస్తోంది
బీఆర్ఎస్ నాయకుల హయాంలో బడ్జెట్ బారెడు. ఖర్చు చారెడు.
స్వేద పత్రం ఎక్కడిది? ఎవడు కష్టపడ్డారు?
బంగారు తెలంగాణ కాదు. బ్రమల తెలంగాణ చేశారు.
బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారు.
దోచుకుంది బీఆర్ఎస్ నాయకులు. భారం మోయాల్సింది తెలంగాణ ప్రజలా?
బీఆర్ఎస్ నాయకులు అప్పు చేస్తే తెలంగాణ ఎందుకు సిగ్గు పడాలి అని అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మంత్రి వర్యులు సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్,ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్,అడిషనల్ కలెక్టర్
శ్రీజ ఐఎఎస్,జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్,డిఎస్పీ రవీందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ, నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు