
telugu galam news e69news local news daily news today news
మహాసభల వాల్పోస్టర్ ఆవిష్కరణ
భద్రాచలం పట్టణ కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ డివిజన్ కార్యాలయంలో మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరిగే సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ యూనిటీ మహాసభల గోడ పత్రికలను ప్రజాపంల పార్టీ నాయకత్వం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి మాట్లాడుతూ సిపిఐ ఎంఎల్ ప్రజా పందా , పిసిసి సిపిఐ (ఎమ్మెల్),సిపిఐ ఎంఎల్ (ఆర్ ఐ)మూడు విప్లవ పార్టీలు ఐక్యమై ఒకే పార్టీగా ఏర్పడాలని నిర్ణయం జరిగింది దీనికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ అనే పేరుని నిర్ణయించడం జరిగిందని అన్నారు ఈ పార్టీ యూనిటీ మహాసభను 2024 మార్చి మూడు నాలుగు ఐదు తేదీలలో ఖమ్మంలో ఏర్పాటు చేయనున్నారని అన్నారు ఈ సందర్భంగా మార్చి మూడవ తేదీన సాయంత్రం మూడు గంటలకు వేలాది మందితో ప్రజా ప్రదర్శన సాయంత్రం ఐదు గంటలకు పెవిలియన్ గ్రౌండ్ (కామ్రేడ్ రవి అన్న సంతోష్ రానా) నగర్లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం మార్చి 4 5 తేదీలలో ప్రతినిధుల సభ నిర్వహించడం జరుగుతుంది కావున ఈ మహా ప్రదర్శనలో ప్రతి ఒక్కరు పాల్గొని యూనిటీ మహాసభలను జయప్రదం ప్రజలను కోరారు అనంతరం మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కెచ్చల కల్పన పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ భద్రాచలం డివిజన్ నాయకులు దాసరి సాయి, మునిగల శివ ప్రశాంత్, పార్టీ పట్టణ సభ్యులు కాలవ కుమారి ,నసీమా ,షకీరా ,రమ , శాంత ,బుజ్జక్క చిన్న తల్లి పాల్గొన్నారు