మిన్నంటిన 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి, భారతదేశం సార్వభౌమత్వ గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని,77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మరిపెడ మండల పరిధిలోని వివిధ శాఖల అధికారులు జెండా వందన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు,తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కృష్ణవేణి పతాకావిష్కరణ చేశారు,అత్యంత వైభవంగా, దేశభక్తి భావం ఉట్టిపడేలా నిర్వహించరు,బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మనందరికీ సమాన హక్కులను, బాధ్యతలను ప్రసాదించిందని కొనియాడారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వేణుగోపాల్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు, వ్యవసాయ శాఖ కార్యాలయం లో వ్యవసాయ విస్తరణ అధికారి వీర సింగ్ పతాకవిష్కరణ చేశారు, శ్రీదుర్గా మండల సమక్య ఆధ్వర్యంలో ఏపీఎం అలివేలు మంగ పతాకావిష్కరణ చేశారు, మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ రవి పతాకావిష్కరణ చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఎస్ఐ వీరభద్రరావు పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు