mulugu news local news telugu news daily telugu galam news e69news
ములుగు జిల్లా, ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గల రామన్నగూడెం రోడ్డు సాయిబాబా ఆలయం ముందు గల మిషన్ భగీరథ పైపు లీక్ అయ్యి ఆ మార్గం గుండా వెళ్తున్న వాహనదారులు, పాదాచారులకు మరీ ముఖ్యంగా జడ్పీఎస్ఎస్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు పాఠశాలకు వచ్చిపోవు క్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని గత 15 రోజులుగా లీకేజీ ద్వారా నీళ్లు రోడ్డు పైకి వచ్చి బురదమయం అవుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ యొక్క లికేజిని క్లియర్ చేసి రోడ్డుపై నీరు నిలవకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.