రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు టి. జితేందర్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు టి. జితేందర్ రెడ్డి
సాక్షాత్తు అయోధ్య రాముని గుడి కూడా నాసిరకంగా నిర్మించారు
దేశ సంపదను ముస్లింలకు పంచి పెడుతున్నారన్న ప్రధాని మోడీ విద్వేషాన్ని ఏమంటారు ..?
రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు పంచి పెడుతుంది. హిందూ స్త్రీల మెడలో ఉన్న మంగళసూత్రాలు కూడా ఎత్తుకుపోతారు. దేశంలో షరియా చట్టాన్ని అమలు చేస్తారు’ అంటూ గత పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని వాటికి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారని రంగారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంటులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి చూస్తున్న బిజెపి నాయకులు అసలు వాస్తవాలను గ్రహించాలని జితేందర్ రెడ్డి హితవు పలికారు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని దేశంలో రాజకీయ కక్షలను రగుల్చుతూ మతం పునాదిపై రాజ్యాన్ని పాలిస్తూ ఆ పాపాన్ని రాహుల్ గాంధీకి అంటగట్టడం బిజెపి పనికిమాలిన చర్యఅని జితేందర్ రెడ్డి తెలిపారు. హిందూ పదం పేరిట రాజకీయ విద్వేషాలు, అరాచకాలు సృష్టిస్తున్నది ముమ్మాటికి బిజెపి పార్టీ అని పేర్కొన్నారు. భారతదేశంలో అన్ని మతాలకు అన్ని జాతులకు ఒకే రాజ్యాంగం ఉందని మరి ప్రధాని మోడీ గత ఎన్నికల్లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారో చూస్తామని అన్నారు. దేశంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసిన మహానాయకుడు రాహుల్ గాంధీ అని అందుకే ప్రజలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆదరించారని అన్నారు. బిజెపి గత ఎన్నికల్లో నైతికంగా ఓడిపోయిందని అన్నారు. హిందూయిజం పేరిట వెర్రి వేషాలు వేస్తున్న బిజెపి నాయకులు వాస్తవాలు గమనించాలని పేర్కొన్నారు. రాముడు పేరిట ఎన్నో రాజకీయాలు చేశారని చివరకు ఆ రాముడు గుడిని కూడా నాసిరకంగా నిర్మించడంతో దేశవ్యాప్తంగా అయోధ్య అబాసుపాలు అయిందని జితేందర్ రెడ్డి తెలిపారు. సాక్షాత్తు అయోధ్య ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని తుక్కుగా ఓడించిందని ఈ విషయాలు ప్రజలను అడిగితే తెలుస్తాయని లేనిపోని వర్గ వైశమ్యాలను రెచ్చగొడుతున్న బిజెపిని ప్రజలు గమనిస్తున్నారని జితేందర్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు బిజెపి నాయకులకు లేదని జితేందర్ రెడ్డి పేర్కొన్నారు.. కేపి