
ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతం చేయాలి
ఈ69న్యూస్ జఫర్ఘడ్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఈ నెల 16న జరిగే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం స్థానిక శాసన సభ్యులు,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశానుసారం
జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి ఐ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు నూకల ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో పార్టీ గ్రామంలో యువజన,మహిళా,సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ముఖ్య నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య,మార్కెట్ కమిటీ మాజి చైర్మెన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అన్నం బ్రహ్మరెడ్డి,మాజీ ఎంపీటీసీ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి,మాజీ జడ్పీటీసీ జిల్లా నాయకులు బానోత్ రాజేష్ నాయక్,సింగారపు అశోక్,స్థానిక మాజీ సర్పంచ్ అనిత సుధాకర్ బాబు,మాజీ ఎంపీటీసీ దేవేందర్ నాయక్,గ్రామశాఖ అధ్యక్షులు బుల్లే పరుశరాములు,తదితరులు పాల్గొని మాట్లాడారు..ప్రతీ గ్రామం నుండి ఒక్కో బూత్ కు 150మందికి తగ్గకుండా బహిరంగ సభకు వచ్చేలా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.