
నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు స్వయంగా ముఖ్యమంత్రి చూస్తున్న పశుసంవర్థక శాఖకే కేటాయింపులు తగ్గిస్తే, రాష్ట్రం రైజింగ్ తెలంగాణా ఎలా సాథ్యమవుతుందని, రాష్ట్రంలో ఉన్న గొర్లకాపర్ల సంక్షేమానికి, జీవాల సంరక్షణకు ఏ మాత్రం సరిపోయే అవకాశం లేదని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జి.ఎం.పి.ఎస్) జిల్లా కమిటీ విమర్శించింది. ఈ రోజు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య బడ్జెట్‌పై ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రవిందర్ మాట్లాడుతూ ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,04,965 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, ముఖ్యమంత్రి చేతిలో ఉన్న పశు సంవర్థక శాఖకు బడ్జెట్లో కేవలం 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఈ శాఖకు 2023`2024లో 2,035కోట్లు కేటాయించగా, గత 2024`2025సంవత్సరంలో 65కోట్లు తగ్గించి 1,970 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం గత సంత్సరం కంటే కూడా 1,803 తగ్గించి 1,674 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఈ మూడేండ్ల కాలం పరిశీస్తే మొత్తం బడ్జెట్ 60వేల కోట్ల పెంచగా, పశుసంవర్థక శాఖకు మాత్రం 361 కోట్లు తగ్గించారు. కేటాయింపులకే ఈ విధంగా ఉండే నిధులు విడుదల చేసే నాటికి ఇంకా ఎన్ని కోతలు పెడుతారో అర్థం కాని పరిస్థితి. కేటాయించిన 1,674 కోట్ల రూపాయలలో కూడా పశుసంవర్థక మరియు మత్స్యశాఖల ఉద్యోగుల జీతభత్యాలకు కార్యాలయాల నిర్వహణకే ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. ఇక మిగిలిన వాటిల్లో మామిడిపల్లిలో నిర్మితమవుతున్న పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం 100కోట్లుగా, మేలు జాతి పశువుల అభివృద్ధి కోసం కంసాన్‌పల్లిలో క్రొత్త ఫ్రోజెన్ సెమన్ బుల్ స్టేషన్ నిర్మాణానికి 21.06 కోట్లు, కొహెడలో ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ హోల్ సేల్ చేపల మార్కెట్‌కు 47 కోట్లు వ్యయం చేయనున్నారు. పాడిరైతుల ప్రోత్సహకానికి 4.20కోట్లు విభజించారు. పశువుల ఆరోగ్య సంవరక్షణను గాలికొదిలేసి కేవలం 6.25కోట్లుగా చూపారు. ప్రగతిపద్దుల్లో మత్స్యకారుల అభివృద్థికి ప్రత్యేకంగా 12కోట్లు విభజింపి చూపారు. గొర్రెల పెంపకందార్ల ఊసేలేదు. గొర్రెల పెంపకందార్ల ఫెడరేషన్‌కు ఒక్క పైసా ఇవ్వలేదు. గొల్లకురుమ ఆత్మగౌరవ భవనాలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. యాదవ కార్పోరేషన్‌కు 50 కోట్లు కేటాయింపులు చూపారు కానీ దేనికి ఖర్చు చేస్తారనే వివరణ లేదు. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ‘‘తెలంగాణ రైజింగ్ 2050’’ అనే ప్రణాళికతో ముందుకు నడిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిణామం 200 బిలియన్ డాలర్ల నుండి పదేండ్లలో ఐదు రెట్లుగా అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు(టిలియన్ డాలర్)కు తీసుకెళ్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మరియు గొర్రెల పెంపకానికి నిధులు కేటాయించకుండా, గ్రామీణ అభివృద్థి ఎలా సాధ్యం అవుతుంది. ఇది చూస్తుంటే తెలంగాణ ‘‘ఫాలింగ్ 2050’’(పడిపోయే తెలంగాణ) వలె కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి పశుసంవర్థక శాఖకు నిధులు కేటాయింపులు పెంచాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రెండో విడుత గొర్రెల పంపిణీ నగదు బదిలీ కోసం, గొర్రెల భీమా, ప్రమాదాల్లో మరణించే గొర్ల కాపరులకు ఎక్స్‌గ్రేషియో, కాపరులకు పెన్షన్, జీవాలకు షెడ్లు మరియు ఫెడరేషన్‌కు నిధులు, నూతన పశువైద్యశాలల నిర్మాణం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో గొర్రెల కాపరుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము .
GMPS
నిన్న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులు స్వయంగా ముఖ్యమంత్రి చూస్తున్న పశుసంవర్థక శాఖకే కేటాయింపులు తగ్గిస్తే, రాష్ట్రం రైజింగ్ తెలంగాణా ఎలా సాథ్యమవుతుందని, రాష్ట్రంలో ఉన్న గొర్లకాపర్ల సంక్షేమానికి, జీవాల సంరక్షణకు ఏ మాత్రం సరిపోయే అవకాశం లేదని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జి.ఎం.పి.ఎస్) జిల్లా కమిటీ విమర్శించింది.
ఈ రోజు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య బడ్జెట్‌పై ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రవిందర్ మాట్లాడుతూ ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 3,04,965 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా, ముఖ్యమంత్రి చేతిలో ఉన్న పశు సంవర్థక శాఖకు బడ్జెట్లో కేవలం 1,674 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఈ శాఖకు 20232024లో 2,035కోట్లు కేటాయించగా, గత 2024
2025సంవత్సరంలో 65కోట్లు తగ్గించి 1,970 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం గత సంత్సరం కంటే కూడా 1,803 తగ్గించి 1,674 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఈ మూడేండ్ల కాలం పరిశీస్తే మొత్తం బడ్జెట్ 60వేల కోట్ల పెంచగా, పశుసంవర్థక శాఖకు మాత్రం 361 కోట్లు తగ్గించారు. కేటాయింపులకే ఈ విధంగా ఉండే నిధులు విడుదల చేసే నాటికి ఇంకా ఎన్ని కోతలు పెడుతారో అర్థం కాని పరిస్థితి. కేటాయించిన 1,674 కోట్ల రూపాయలలో కూడా పశుసంవర్థక మరియు మత్స్యశాఖల ఉద్యోగుల జీతభత్యాలకు కార్యాలయాల నిర్వహణకే ఎక్కువ మొత్తం ఖర్చవుతుంది. ఇక మిగిలిన వాటిల్లో మామిడిపల్లిలో నిర్మితమవుతున్న పశు వైద్య టీకా ఉత్పత్తి కేంద్రం 100కోట్లుగా, మేలు జాతి పశువుల అభివృద్ధి కోసం కంసాన్‌పల్లిలో క్రొత్త ఫ్రోజెన్ సెమన్ బుల్ స్టేషన్ నిర్మాణానికి 21.06 కోట్లు, కొహెడలో ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ హోల్ సేల్ చేపల మార్కెట్‌కు 47 కోట్లు వ్యయం చేయనున్నారు. పాడిరైతుల ప్రోత్సహకానికి 4.20కోట్లు విభజించారు. పశువుల ఆరోగ్య సంవరక్షణను గాలికొదిలేసి కేవలం 6.25కోట్లుగా చూపారు. ప్రగతిపద్దుల్లో మత్స్యకారుల అభివృద్థికి ప్రత్యేకంగా 12కోట్లు విభజింపి చూపారు. గొర్రెల పెంపకందార్ల ఊసేలేదు. గొర్రెల పెంపకందార్ల ఫెడరేషన్‌కు ఒక్క పైసా ఇవ్వలేదు. గొల్లకురుమ ఆత్మగౌరవ భవనాలకు ఒక్క రూపాయి కేటాయించలేదు. యాదవ కార్పోరేషన్‌కు 50 కోట్లు కేటాయింపులు చూపారు కానీ దేనికి ఖర్చు చేస్తారనే వివరణ లేదు.
తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ‘‘తెలంగాణ రైజింగ్ 2050’’ అనే ప్రణాళికతో ముందుకు నడిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిణామం 200 బిలియన్ డాలర్ల నుండి పదేండ్లలో ఐదు రెట్లుగా అభివృద్ధి చేసి 1000 బిలియన్ డాలర్లు(టిలియన్ డాలర్)కు తీసుకెళ్తామని ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ మరియు గొర్రెల పెంపకానికి నిధులు కేటాయించకుండా, గ్రామీణ అభివృద్థి ఎలా సాధ్యం అవుతుంది. ఇది చూస్తుంటే తెలంగాణ ‘‘ఫాలింగ్ 2050’’(పడిపోయే తెలంగాణ) వలె కనబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి పశుసంవర్థక శాఖకు నిధులు కేటాయింపులు పెంచాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన రెండో విడుత గొర్రెల పంపిణీ నగదు బదిలీ కోసం, గొర్రెల భీమా, ప్రమాదాల్లో మరణించే గొర్ల కాపరులకు ఎక్స్‌గ్రేషియో, కాపరులకు పెన్షన్, జీవాలకు షెడ్లు మరియు ఫెడరేషన్‌కు నిధులు, నూతన పశువైద్యశాలల నిర్మాణం కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో గొర్రెల కాపరుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాము .