ముగిసిన అహ్మదీయ ముస్లింల మూడు రోజుల ధార్మిక వార్షిక మహా సభలు
అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో లండన్ కేంద్రంలో మూడు రోజుల(జులై 28,29,30) ధార్మిక మహా సభలు ఆదివారంతో విజయవంతంగా ముగిశాయి.మూడు రోజులు జరిగిన సమావేశాలలో ధార్మిక,ఆధ్యాత్మిక అంశములపై అహ్మదీయ ముస్లిం జమాత్ పండితులు,మౌల్వీలు ఉపన్యాసాలు చేశారు. అంతర్జాతీయ అహ్మదీయుల అథినేత హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ఈ మహా సభలకు ప్రత్యేకంగా హాజరై జమాత్ సభ్యులకు హితబోధ చేస్తూ మార్గ నిర్దేశాలు చేశారు. ఆదివారం సాయంత్రం భారత దేశ కాలమానం ప్రకారం తన చేతుల పై చెయ్యి లు వేయించుకొని 5:30 నిమిషాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అహ్మదీయులతో బైఅత్ ప్రతిజ్ఞ చేయించారు.దీనిని అహ్మదీయు ఆలమీ బైత్ కార్యక్రమం అని సంబోధిస్తారు.ఈ మహా సభలలో దాదాపు 220 దేశాలకు చెందిన అహ్మదీయ తెగకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.మరియు ఈ మహా సభలలో వివిధ మతాల పండితులు,రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొని వారి వారి భావాలు అహ్మదీయులతో పంచుకున్నారు.కొందరు నాయకులు మంత్రులు, ప్రధాన మంత్రులు తమ సందేశాలను ఉత్తరాల ద్వారా మరియు తమ అనుచరుల ద్వారా పంపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ మూడు రోజుల సభా కార్యక్రమాలను యావత్ ప్రపంచ అహ్మదీయులు వారి ఎంటిఎ టీవీ ఇంటర్నేషనల్ శాటలైట్ చానల్ల ద్వారా మరియు యూట్యూబ్,ఫేస్బుక్,తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వివిధ బాషలలో తిలకించారు.