మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా
బుధవారం రోజున గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఎం.సి.పి.ఐ.యు వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం.సి.పి.ఐ.యు వరంగల్ నగర కార్యదర్శి మాలోత్ సాగర్ మాట్లాడుతూ..గత 15 రోజులుగా నగరంలోని వివిధ డివిజన్లలో నిర్వహించిన సర్వేల ద్వారా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని,వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఇటీవల కురిసిన మౌంథా తుఫాన్ కారణంగా అనేక కుటుంబాలు ముంపునకు గురయ్యాయని,స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని విమర్శించారు.ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని అన్నారు.వరంగల్ నగరంలో కోతుల బెడద,వీధి కుక్కల బెడద తీవ్రమై ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని,వాటి నుండి ప్రజలకు తక్షణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.సైడ్ కాలువలు,డ్రైనేజీ సమస్యలు,అంతర్గత రోడ్ల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని కోరారు.అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని,ఇప్పటివరకు ఇందిరమ్మ బిల్లులు ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు 27 నెలలు గడిచినా ఆరు గ్యారెంటీల అమలు ఊసే లేదని విమర్శించారు.ధూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నర్రా ప్రతాప్,ముక్కెర రామస్వామి,ఎగ్గెని మల్లికార్జున్,మాలోత్ ప్రత్యూష,జిల్లా కమిటీ సభ్యులు ఏ.నరసయ్య,ఎం.ప్రభాకర్,కనకం సంధ్య,ఖిలా వరంగల్,రంగశాయిపేట,కరీమాబాద్,కాశిబుగ్గ,మిడిల్ ఏరియా కార్యదర్శులు సుంచు జగదీష్,ఐతమ్ నగేష్,గనపాక ఓదెల్,పెరుమల్ల గోవర్ధన్,ఎండి.మహబూబ్బాషా,శాఖ కార్యదర్శులు పూలమ్మ,ఆశా బేగం,రాజల్ల,లలిత,నాయకులు ప్రశాంత్,యాకయ్య రాజు,మానస,లక్ష్మి తదితరులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.