మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన వరంగల్ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు నకరగంటి మోహన్ తల్లి గారైన నకరగంటి రాంబాబు అనారోగ్యంతో మరణించగా నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు
అనంతరం ఉడుతగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జన్నపురెడ్డి చంద్రరెడ్డి సతీమణి జన్నపురెడ్డి రమాదేవి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎమ్మెల్యే నాగరాజు వెంటమాజీ ఎం. పి. టీ సి బొల్లెపల్లి మధు గౌడ్. ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.