మెగా రక్తదాన శిబిరం
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్(హౌజ్ బుజుర్గ్) గ్రామంలో ఈనెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యువజన సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా యూత్ అధ్యక్షుడు సయ్యద్ ముజాహిద్ అహ్మద్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ చైర్మెన్ ఇనగల వెంకట్రామ్ రెడ్డిని ఆహ్వానించారు.మెగా రక్తదాన శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు సయ్యద్ ముజాహీద్,స్థానిక మౌల్వి సాహెబ్ మహమ్మద్ మషూద్ అహ్మద్,సెక్రటరీ మాల్ మహమ్మద్ అక్బర్ మరియు సయ్యద్ కరీం పాల్గొన్నారు.