
telugu galam news e69news local news daily news today news
ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్దే జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయం: ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఈ నెల 21.01.2024 న ములకపాడు క్రీడా మైదానంలో మొదలయిన మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈ రోజు ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు.ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి.సాయి మనోహర్,ఏఎస్పీ భద్రాచలం పరితోష్ పంకజ్ ఐపిఎస్ మరియు ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్ లు కూడా పాల్గొన్నారు.నాలుగు రోజులు పాటు జరిగిన ఈ మండల స్థాయి వాలీబాల్ పోటీలకు సుమారుగా 50 టీమ్ లు పాల్గొన్నాయి.కొత్తమారేడుబాక మరియు అంజుబాక టీం లు ఫైనల్ కు చేరుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు,సిబ్బంది మరియు స్థానిక ప్రజలు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ ను ఆసక్తితో తిలకించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని యువత చదువుతోపాటు క్రీడల్లోను రాణిస్తూ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.దుమ్ముగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంత యువత కోసమే సుమారుగా రెండు కోట్ల రూపాయల వ్యయంతో పోలీసుల ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.త్వరలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించనున్నామని తెలియజేశారు.దుమ్ముగూడెం మండలం నుండి యువత క్రీడల్లో జాతీయస్థాయి వరకు చేరుకొని ఈ ప్రాంతానికి,జిల్లాకి,రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు.యువత జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమమే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసు శాఖ తరపున వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.దుమ్ముగూడెం మండల ప్రజలకు క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు స్థానిక యువత,ప్రజలు ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం సిఐ రమేష్,ఇన్స్పెక్టర్స్ అశోక్,ముత్యం రమేష్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజువర్మ ఎస్సైలు గణేష్, కేశవ మరియు తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో మొదటి బహుమతి గెలుచుకున్న కొత్తమారేడుబాక,రెండవ బహుమతి గెలుచుకున్న అంజుబాక,మూడవ బహుమతి గెలుచుకున్న చిన్న నల్లబెల్లి టీం లు ఎస్పీ గారి చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు.