హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.*
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డి.వై.ఎఫ్.ఐ ).భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ ) సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న షహిద్ భగత్ సింగ్ స్మరక యువజన ఉత్సవాల పోస్టర్ బషీరాబాగ్ కమిషనర్ కార్యాలయం లో కమిషనర్ సీవీ ఆనంద్ గారు ఆవిష్కరణ చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు విద్యార్థులు,యువత డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలునిచ్చారు. డ్రగ్స్,గంజాయి నిర్ములన కోసం కృషి చేయడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్నారు.నేటి యువత లో కొద్దిమంది చెడు వ్యసనాలకు అలవాటుపడి వారి జీవితలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.దేశంకోసం ప్రాణర్పణ చేసిన భగత్‌సింగ్ స్ఫూర్తి తో యువజన ఉత్సవాలను నిర్వహించడం , ఎస్.ఎఫ్.ఐ,డి.వై.ఎఫ్.ఐ సంఘాలు “సే నో టూ డ్రగ్స్” నినాదంతో క్యాంపెయిన్ నిర్వహిస్తుండటం అభినందనీయమని,ఈ కాంపెయిన్ ద్వారా విస్తృతంగా విద్యార్థులను, యువత ను చైతన్యవంతం చేయాలనీ సూచించారు. భగత్‌సింగ్ స్మారక యువజనోత్సవ కమిటీ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జె.కే శ్రీనివాస్,ఎస్.ఎఫ్.ఐ, డి.వై.ఎఫ్.ఐ నగర కార్యదర్శిలు అశోక్ రెడ్డి, జావీద్ లు మాట్లాడుతూ యువజన ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో విస్తృతంగా సదస్సులు, క్రికెట్,చెస్,టకే రన్, రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, భగత్ సింగ్ సందేశ్ ర్యాలీ,ముగింపు సభ లాంటి కార్యక్రమలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు అజయ్ బాబు, మహేందర్, ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు లెనిన్ జిల్లా నాయకులు స్టాలిన్, రాజయ్య తదితరులు పాలొగొన్నారు.