
రంజాన్ మతసామరస్యానికి ప్రతీక…ఎమ్మెల్యే డా.రాజయ్య
రంజాన్ అంటే ఇవ్వడం…ఎమ్మెల్యే డా.రాజయ్య
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈ రోజు…చిల్పూర్ మండలం , వెంకటాద్రిపేట గ్రామంలోని మజీద్ వద్ద రంజాన్(Eid-Ul-Fitr) పర్వదినం (రంజాన్ తోపా) సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు మరియు బట్టల పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున నిరుపేద ముస్లింలకు గిఫ్ట్ ప్యాకేట్స్(బట్టలు) పంపిణీ చేసిన అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు , ఇమామ్ లు ఎమ్మెల్యే గారి చేతికి దట్టి కట్టి , తలకు కుల్లా(టోపి) పెట్టి మరియు చాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.
అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…మొదటగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ అంటే మతసామరస్యానికి ప్రతీక అని తెలిపారు.
రంజాన్ మాసం అంటే ఖురాన్ రాసిన మాసం అని అంటారని తెలిపారు. రంజాన్ అంటే ఇవ్వడం అని తెలిపారు.
రంజాన్ మాసంలో ముస్లింలు ప్రతి రోజు దాదాపు 15 గంటల పాటు నిష్టతో కూడిన కష్టమైన ఉపవాస ప్రార్థనలు చేస్తారు అని తెలిపారు. రంజాన్ మాసంలో దినమంతా కూడా ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని తెలిపారు.
ఈ నెలరోజుల ప్రార్థనలతో సంవత్సరానికి సరిపోయే పుణ్యాన్ని కూడగట్టుకుంటారని తెలిపారు. ఇతరులకు సహాయం చేయడానికి ఇతరుల దృష్ట్యా క్షేమ గుణాన్ని కలిగి , ఇతరులతో మమత , ప్రేమానురాగాలతో మేదులుతూ ఉండాలని సూచించారు.
సర్వమాతాల సారాంశం ఒకటే నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్పుతాయని తెలిపారు.అన్ని మతాలను గౌరవిస్తూ నీకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకోవాలని సూచించారు.
మన నియోజకవర్గానికి 1500 రంజాన్ కానుకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగినది.
భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కెసిఆర్ గారి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ గారు కృషి చేస్తున్నారని తెలిపారు.
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు.
రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాల మధ్య వారి వారి పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతోటి హిందువులకు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని 2 లక్షల మంది క్రిస్టియన్లకు బట్టల పంపిణీతో పాటు ప్రేమవిందు పేరిట ఆత్మీయ విందు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని 3 లక్షల మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలతో పాటగా ఇఫ్తార్ విందు ఇస్తున్నారని తెలిపారు. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తూ అన్ని మతాలను గౌరవించడం జరుగుతుందని తెలిపారు రంజాన్ అంటేనే ఇవ్వడం కావున మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలు ఇవ్వడంతో పాటు ఇఫ్తార్ ఇందు విందు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు..
గత ప్రభుత్వాలు మైనార్టీలు ఓటు వేసే యంత్రాలుగా ఉపయోగించుకునేవారు
మైనార్టీ అభివృద్ధి కొరకు ఎలాంటి కృషి చేయలేదు, నేడు తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ గారు మైనార్టీ సోదరులకు అన్నివిధాలుగా అండగా ఉంటూ మైనార్టీల అభివృద్ధి కొరకు వారి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రత్యేకంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా ముస్లిం అమ్మాయిల వివాహలకు 100116 /- రూపాయలు షాదీముబారక్ పథకం ద్వారా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.
ముస్లిం సోదరులు విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ప్రభుత్వం తరపున రూ.20 లక్షలు ఆర్థిక సాయం కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు పెళ్లి కానుకగా షాధిముబారఖు పథకం ద్వారా రూ.100116 /- లు ఇస్తుంది.అదేవిధంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే విద్యార్థుల మీద సంవత్సరానికి 1.20 లక్షలు ఖర్చు చేస్తుందని తెలిపారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని మూడు లక్షల మందికి నిరుపేద ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు గిఫ్ట్ ప్యాకేట్స్ ఇవ్వడం , అందులో భాగంగా స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గానికి 1500 గిఫ్ట్స్ ప్యాకేట్స్ రావడం జరిగింది.అందులో భాగాంగానే ఈ రోజు గిఫ్ట్స్ ప్యాకేట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు , సంబంధిత శాఖల అధికారులు , పార్టీ ప్రతినిధులు , ముస్లిం ఇమాములు , ముస్లిం మత పెద్దలు , ముస్లిం సోదరులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.