రాంనగర్ గ్రామంలో సర్పంచ్ ప్రచారం వేడెక్కుతోంది
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం వేగంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆకులపల్లి స్వాతి భరత్ కుమార్ వాడవాడ, వీధి వీధి తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని మద్దతును అభ్యర్థిస్తున్నారు.
తన ప్రచారంలో భాగంగా స్వాతి — అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఆశీస్సులతోనే తాను సర్పంచ్ బరిలో నిలిచినట్లు తెలిపారు.
తాను విద్యావంతురాలు కావడం, గ్రామ సమస్యలను సమర్థంగా అర్థం చేసుకుని పరిష్కరించే సామర్థ్యం ఉందని స్వాతి ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రస్తుతం వీధిలైట్లు, డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలు ఉన్నాయని గుర్తుచేస్తూ— గెలిస్తే, ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు సహకారంతో పెద్దఎత్తున నిధులను తెప్పించి ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. రాంనగర్ను సంపూర్ణ ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడం తన ముఖ్య లక్ష్యమని తెలిపారు.
గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 25 మంజూరు కాగా, ఇంకా 25 ఇండ్లు మంజూరు కావాల్సి ఉందని చెప్పారు. గ్రామంలో పేదవాళ్లు ఎవరైనా ఉన్నట్లయితే వారిని గుర్తించి, వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఏ చిన్న సమస్య అయినా వెంటనే స్పందించి పరిష్కరిస్తానని స్పష్టం చేశారు.
“మీ బిడ్డగా గ్రామ సేవ చేసే అవకాశం ఇవ్వండి… నా గుర్తు కత్తెరకు ఓటేయండి, అధిక మెజార్టీతో గెలిపించండి” అని ఆకులపల్లి స్వాతి భరత్ కుమార్ గ్రామస్తులను వేడుకున్నారు.
రాంనగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం రోజురోజుకీ ఉత్సాహభరితంగా మారుతోంది.అన్నారు.