
రాజావారి కోటని సందర్శించిన విద్యార్థులు
మునగాల మండల కేంద్రానికి చెందిన సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థులు శనివారం నడిగూడెం మండల కేంద్రంలోని అతి పురాతన రాజావారి కోటని సందర్శించడం జరిగింది, శనివారం నో బ్యాక్ డే గా రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన సందర్భంగా సాయి గాయత్రి విద్యాలయ విద్యార్థులు విద్య విజ్ఞాన యాత్రలో భాగంగా, మునగాల పరగానాలో పురాతన ప్రదేశంగా స్వాతంత్ర పూర్వకాలం నుండి అత్యంత చారిత్రక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కి ,స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య గారి చేతుల మీదుగా భారత జాతీయ పతాక రూపకల్పనకు కేంద్రంగా నిలిచిన రాజావారి కోటని ఈ సందర్భంగా తమ పాఠశాల విద్యార్థులను సందర్శినార్థం తీసుకెళ్లడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా రాజావారి కోట నిర్మాణం, కోట ప్రధాన ద్వారాలు (గుమ్మటాలు) కోటలో ఏర్పాటుచేసిన గ్రంథాలయం ,పురాతన వస్తువులు, ఆడిటోరియం, నాటి కోట విశిష్టత మరియు రాజావారి కోట నందు భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన చారిత్రక అంశాలను ఈ సందర్శనలో తమ విద్యార్థులకు వివరించినట్లు వారు తెలిపారు. నిత్యం పుస్తకాలతో చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు ,మన పక్కనే ఉన్న అత్యంత పురాతన ప్రసిద్ధిగాంచిన కోట విశేషాలని తెలుసుకోవడం ద్వారా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు ప్రత్యేక అనుభూతికి లోనయ్యారని వారు ఈ సందర్భంగా తెలిపారు.