
telugu galam news e69news local news daily news today news
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గళం న్యూస్ రేగొండ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లిగోరి మండలంలోని అన్ని గ్రామాలల్లో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం రేగొండ మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడివో కార్యాలయంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ- రవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని అన్ని గ్రామాలల్లో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని సంబధిత అధికారులకు సూచించారు. చెంచుపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని గ్రామ సర్పంచ్ సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించి అక్కడున్న మిషన్ భగీరథ అధికారులు ఈ సమావేశం అనంతరం చెంచుపల్లి గ్రామానికి వెళ్ళి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా, మండలంలోని పలు గ్రామాలల్లో చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములల్లో అక్రమ కట్టడాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అవసరం అధికారులపై ఉందని అన్నారు. నియోజకవర్గంలో సరిగా పనిచేయని అధికారులపై చర్యలు ఉంటాయని, జిల్లా అధికారులు విధిగా మండల సమావేశాలకు హాజరు కావాలన్నారు. అన్ని గ్రామాలల్లో కొత్త పెన్షన్లు ఎంపిక చేయడం జరుగుతుందని, త్వరలోనే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులను అందిస్తామని అన్నారు. అనంతరం ఎంపీపీ దంపతులు ఎమ్మెల్యే ని భారీ గజమాలతో సత్కారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు కూడా ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి, పూలబొకే ఇచ్చి సన్మానం చేశారు.